CHINA: మేము యుద్ధాలకు సృష్టించం, పాల్గొనం.. ట్రంప్‌కి చైనా కౌంటర్..
- చైనాపై 100 శాతం సుంకాలు విధించాలి..
- నాటో దేశాలను కోరిన ట్రంప్..
- గట్టిగా కౌంటర్ ఇచ్చిన చైనా..
- తాము యుద్ధాలు ప్రోత్సహించడం లేదన్న వాంగ్‌యీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CHINA: రష్యాపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు చైనాపై సుంకాలు విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో దేశాలను కోరారు. నాటో దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపేయాలని ఆయన ఓ లేఖలో కోరారు. చైనాపై 100 శాతం సుంకాలు విధించాలని లేఖలో కోరారు. అన్ని నాటో దేశాలు అంగీకరించి సుంకాలు వేయడానికి సద్ధంగా ఉన్నప్పుడు, తాను రష్యాపై పెద్ద ఆంక్షలు విధించడానికి సిద్ధంగా ఉన్నానని లేఖలో పేర్కొన్నారు.
Read Also: Zohran Mamdani: న్యూయార్క్‌లో నెతన్యాహూను అరెస్ట్ చేయిస్తా.. మమ్దానీ వార్నింగ్..
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
అయితే, ట్రంప్ ప్రతిపాదనపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘తాము యుద్ధానికి కుట్రలు పన్నడం లేదని, యుద్ధాల్లో పాల్గొనడం లేదని’’ చైనా కఠినమైన, స్పష్టమైన సందేశం ఇచ్చింది. స్లోవేనియా పర్యటనలో ఉన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ.. యుద్ధం సమస్యలను పరిష్కరించలేదని, ఆంక్షలు వాటిని క్లిష్టతరం చేస్తాయని రాయిటర్స్‌లో అన్నారు.
ఇదే విధంగా, రష్యా నుంచి చమురు కొంటున్న భారత్‌పై కూడా సుంకాలు విధించాలని ట్రంప్ నాటో దేశాలకు పిలుపునిస్తున్నాడు. ఇలా చేయడం వల్ల రష్యాపై ఒత్తిడి పెరుగుతోందని, తద్వారా ఉక్రెయిన్ యుద్ధం ఆగుతుందని ట్రంప్ చెబుతున్నాడు. ఇప్పటికే, రష్యా ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధానికి భారత్ పరోక్షంగా, రష్యా నుంచి చమురు కొంటూ సాయం చేస్తోందని ట్రంప్ ఆరోపిస్తున్నాడు. దీంతో భారత్‌పై ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 50 శాతం సుంకాలను విధించారు. ఈయూ, యూరోపియన్, నాటో దేశాలను కూడా భారత్, చైనాలపై సుంకాలు పెంచాలని కోరుతున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!