Site icon NTV Telugu

Pakistan: భారత రక్షణ సమాచారాన్ని చైనా మాకు అందించింది: పాక్ రక్షణ మంత్రి..

Kawaja Asif

Kawaja Asif

Pakistan: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఏం మాట్లాడినా సంచలనంగా మారుతోంది. ఆపరేషన్ సిందూర్, పహల్గామ్ దాడి సమయంలో ఆయన స్వయంగా పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిందని ఒప్పుకున్నారు. ఆ తర్వాత పాక్ నేషనల్ అసెంబ్లీలో భారత దాడుల గురించి తప్పుడు ప్రకటనలు చేస్తూ దొరికిపోయారు. సొంత దేశ ప్రజలతోనే ఛీత్కారాలు ఎదుర్కొన్నారు. తాజాగా, ఆయన ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ అసభ్యకరమైన భాష మాట్లాడటంపై సొంత దేశంలోనే విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి భాష వాడితే భారత్‌తో చర్చలు ఎలా ముందుకు వెళ్తాయని ఆ దేశానికి చెందిన మాజీ రాయబారి హుస్పేన్ హక్కానీ ఆసిఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Pakistan: అభినందన్‌ను పట్టుకున్న మేజర్ హతం.. అంత్యక్రియలకు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ హజరు..

ఇదిలా ఉంటే, ఆపరేషన్ సిందూర్ సమయంలో తమకు చైనా సహకరించిందంటూ ఖవాజా ఆసిఫ్ వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన స్వయంగా దీనిని ఒప్పుకున్నారు. భారత వైమానిక రక్షణ వ్యవస్థ, క్షిపణులు, వైమానిక మార్గాలు, ఆపరేషన్ వంటి అంశాలపై చైనాకు భారత్‌తో సమస్యలు ఉన్నాయని పాక్ రక్షణ మంత్రి అన్నారు. భారత రక్షణ వ్యవస్థకు సంబంధించిన వివరాలను చైనా తమకు అందించిందని చెప్పారు. భారత్‌తో చైనాకు కూడా ఇబ్బందులు ఉన్నాయని, పాక్ తో ఇంటెలిజెన్స్ పంచుకోవడం చాలా సాధారణమని చెప్పారు. వ్యూహాత్మకంగా దగ్గరగా ఉండే రెండు దేశాల మధ్య ఇంటెలిజెన్స్ పంచుకోవడం సాధారణం అని అన్నారు.

Exit mobile version