Site icon NTV Telugu

China Blocks India: మరోసారి పాకిస్తాన్‌కు మద్దతుగా చైనా.. ఇండియా ప్రతిపాదనకు అడ్డు

Uno

Uno

China Blocks India-US Move At UN Again On Blacklisting Pak-Based Terrorist: డ్రాగన్ దేశం చైనా మరోసారి తన భారత వ్యతిరేకతను ప్రదర్శించిది. తన మిత్రదేశం పాకిస్తాన్ దేశానికి వంతపాడింది చైనా. ప్రపంచంలో ఉగ్రవాదానికి కేంద్రంగా పాకిస్తాన్ ఉందని అన్ని దేశాలకు తెలుసు. భారతదేశంపైకి సీమాంతర ఉగ్రవాదాన్ని ఎప్పటికప్పడు ఎగదోస్తుంటుంది పాకిస్తాన్. అయినా కూడా తాము ఉగ్రవాద బాధితులమే అని మొసలి కన్నీరు కారుస్తుంటుంది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్, ఆల్ ఖైదా, హక్కానీ నెట్ వర్క్ వంటి ఉగ్రవాద సంస్థలకు కేంద్రంగా ఉంది. ఆయా ఉగ్రవాద సంస్థల అగ్రనేతలు పాకిస్తాన్ లో బహిరంగంగానే తిరుగుతుంటారు. అయినా కూడా పాకిస్తాన్ ప్రభుత్వం ఎటువంటి చర్యలను తీసుకోవడం లేదు.

Read Also: Snake on Plane: విమానంలో పాము.. ఆందోళనకు గురైన ప్రయాణికులు..

ఇదిలా ఉంటే పాకిస్తాన్ దేశానికి చెందిన లష్కరే తోయిబా నాయకుడు షాహిద్ మహమూద్ ను నిషేధిత జాబితాలో చేర్చాలని, అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితిలో భారత్, అమెరికా చేసిన ప్రతిపాదనను నిలిపివేసింది చైనా. పాక్ ఉగ్రవాది షాహిద్ మహసూద్ నిషేధిత జాబితాలో చేర్చాలని గత కొన్ని నెలలుగా భారత్, అమెరికా నాలుగు సార్లు ప్రతిపాదనలు చేస్తే చైనా తన వీటో అధికారంలో అడ్డుకుంటోంది. ఇప్పటికి ఇలా అడ్డుకోవడం నాలుగోసారి.

ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలోని 1267 ఆల్ ఖైదా ఆంక్షల కింద మహసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే ప్రక్రియకు పాకిస్తాన్ కు అండగా నిలుస్తోంది చైనా. అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ డిసెంబర్ 2016లో మహమూద్ ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించింది. భద్రతా మండలిలో శాశ్వస సభ్యదేశాలు అయిన ఫ్రాన్స్, చైనా, రష్యా, అమెరికా, బ్రిటన్ దేశాల్లో చైనా మినహా మిగతా దేశాలు అన్నీ కూడా భారత నిర్ణయానికి మద్దతు ఇస్తున్నాయి. ప్రతీసారి భారత్ ను ఇరుకున పెట్టేందుకు చైనా, పాకిస్తాన్ దేశానికి వంత పాడుతోంది.

Exit mobile version