NTV Telugu Site icon

sunitha krishnan: టెలిగ్రామ్‌, పేటీఎం, ఫోన్‌పే యాప్‌లపై చర్యలు తీసుకోవాలి.. సునీతాకృష్ణన్‌

Untitled 17

Untitled 17

Hyderabad: దశాబ్ద కాలంగా సాంకేతికత చాల అభివృద్ధి చెందింది. పెరిగిన సాంకేతికతను కొందరు మంచికి వినియోగించుకుంటుంటే మరి కొందరు మాత్రం విజ్ఞానాన్ని వినాశనానికి ఉపయోగిస్తున్నారు. చిన్న పిల్లలు అని కనికరం లేకుండా అశ్లీల చిత్రాలను తీసి సోషల్ మీడియా వేదికగా విక్రయిస్తున్నారు. ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ పైన స్పందించారు బాలల హక్కుల కార్యకర్త సునీతాకృష్ణన్‌. వివరాలలోకి వెళ్తే.. సునీతాకృష్ణన్‌ మంగళవారం డీజీపీ అంజనీకుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో టెలిగ్రామ్‌ యాప్ లో విచ్చలవిడిగా బాలల అశ్లీల(చైల్డ్‌ పోర్నోగ్రఫీ) వీడియోలు విక్రయిస్తున్నారని.. అందుకు గాను పేటీఎం, ఫోన్‌పేలలో రూ.50 చెల్లిస్తే చాలు బాలల అశ్లీల వీడియోల లింకులు పంపుతున్నారని.. ఆ వీడియోల్లో ఉన్న చిన్నారుల్లో.. భారత్‌కు చెందినవారు కూడా ఉన్నట్లు కనిపిస్తోంది పేర్కొన్నారు.

Read also:BJP: రాష్ట్ర ఎన్నికలపై పాకిస్తాన్ కూడా కన్నేసింది.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..

కాగా తాను ఎవరో చెప్పింది విని ఫిర్యాదు చేయడం లేదని.. స్వయంగా మారుపేరుతో ‘గరల్స్‌ అండ్‌ బాయ్స్‌’ అనే చానల్‌లో చేరానని.. అనంతరం ఆ చానల్‌లో చిన్నారుల అశ్లీల దృశ్యాల అమ్మకంపై ప్రకటనలను చూసాను అని వెల్లడించారు. అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి విక్రేతను చాటింగ్‌లో సంప్రదించగా.. ఫోన్‌పే /పేటీఎంలో రూ.50 పంపమన్నారు అని.. డబ్బులు పంపిన తరువాత అశ్లీల వీడియోల లింకులు ఇచ్చారు అని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఆ చానల్‌లో 31వేల మంది సభ్యులున్నారు అని తెలిపారు. డీజీపీ టెలిగ్రామ్‌, పేటీఎం, ఫోన్‌పే యాప్‌లపై వెంటనే చర్యలు చర్యలు తీసుకోవాలని.. బాలల దినోత్సవం రోజున ఇస్తున్న ఈ ఫిర్యాదుపై వెంటనే స్పందించాలని కోరారు. అయితే ఈ విషయం పైన టెలిగ్రామ్‌ కూడా స్పందించింది. ఈ తరహా చర్యలను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. అందుకుగాను ‘స్టాప్‌ చైల్డ్‌ అబ్యూస్‌’ అనే చానల్‌ను ఏర్పాటు చేసి, తమకు వచ్చిన ఫిర్యాదుల మేరకు రోజుకు 2000-3000 చానల్స్‌, గ్రూప్‌లను తొలగిస్తున్నట్లు వివరించింది.