Chidambaram Nataraja Temple issue:తమిళనాడులోని ప్రతిష్టాత్మక చిదంబర నటరాజ స్వామి ఆలయ సంపద వివాదం కొనసాగుతోంది. ప్రభుత్వ చర్యలను పురోహితులు ఒప్పుకోవడం లేదు. 1956 నుంచి ఆలయం సంపదను లెక్కలు చెప్పడానికి అర్చకులు ఒప్పుకోవడం లేదు. అయితే ప్రభుత్వం మాత్రం ప్రజలకు, భక్తులకు పారదర్శకంగా ఉండేందుకు సంపద వివరాలను చెప్పాలని కోరుతోంది. ఈ వ్యవహారం స్టాలిన్ సర్కార్ వర్సెస్ అర్చకుల మధ్య వివాదంగా మారింది.
1956 నుంచి సంపద లెక్కలను చెప్పడానికి అర్చకులు ఒప్పుకోలేదు. 2005 నుంచి 2022 వరకు ఉన్న సంపద వివరాలను మాత్రమే దేవాదాయశాఖ అధికారులు సేకరించారు. సంపద వివరాల సేకరణ పేరుతో కావాలనే ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతోంది అర్చకులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే నేడు మరోసారి అధికారులు ఆలయానికి వెళ్లనున్నారు. చిదంబర ఆలయం నిర్వహణలో దీక్షితులదే ప్రధాన భాద్యత. ఇప్పటి వరకు ఆ దేవాలయం నిర్వహణలో దేవాదాయ శాఖ ఎప్పుడూ కలుగచేసుకోలేదు.
Read Also: Dubai: ముస్లిం దేశంలో హిందూ ఆలయం.. దసరా సందర్భంగా ప్రారంభం
ఇదిలా ఉంటే స్టాలిన్ సర్కార్ వచ్చిన తర్వాత దేవాలయ ఆస్తులను లెక్కించేందుకు నిర్ణయం తీసుకుంది. ఆధీనాలు, దీక్షితుల ఆధ్వర్యంలో ఆలయ ఆస్తులు లెక్కించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని అధీనాధిపతులు, దీక్షితులు, అర్చకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎప్పుడు చెబుతుంటే ద్రావిడియన్ మోడల్ మాకు అవసరం లేదని ప్రభుత్వానికి అర్చకులు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. గత నెల నుంచి స్టాలిన్ ప్రభుత్వం, అర్చకుల మధ్య వివాదం రగులుతోంది.
భారతదేశంలో ఉన్న అత్యంత పురాతన దేవాలయాల్లో చిదంబరం నటరాజస్వామి ఆలయం ఒకటి. తమిళనాడులోని కడలూర్ జిల్లాలో ఈ టెంపుల్ ఉంది. శివుడు ఇక్కడ నటరాజమూర్తి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. ఈ దేవాలయాన్ని 10వ శాతాబ్ధంలో చోళ సామ్రాజ్యం సమయంలో రాజులు నిర్మించారు. ఆ తరువాత పాండ్యులు కూడా దేవాలయాభివృద్ధికి తోడ్పాటును అందించారు. ద్రవిడియన్ శిల్పకళతో ఈ దేవాలయాన్ని నిర్మించారు.