Chhattisgarh: “మోడీ సార్ నా భార్యను మీరే కాపాడాలి”.. ఒమన్‌లో చిత్రహింసలకు గురవుతున్న భారతీయ మహిళ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌కి చెందిన ఓ మహిళ ఒమన్ దేశంలో నరకయాతన పడుతోంది. బతుకుదెరువు కోసం అక్కడికి వెళ్లిన సదరు మహిళను యజమాని చిత్రహింసలు పెడుతున్నారు. బందీగా ఉంచుకుని, వేరే వారికి అమ్మేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ, తనను రక్షించాలని భారత ప్రభుత్వాన్ని వేడుకున్న మహిళ వీడియో వెలుగులోకి వచ్చింది. తన భార్యను ఒమన్ నుంచి కాపాడాలని మహిళ భర్త రాష్ట్ర పోలీసులను కోరాడు. ఆమెను విడిచిపెట్టేందుకు రూ. 2 లక్షలు- 3 లక్షలు కోరుతున్నట్లు జోగి ముఖేష్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టినట్లు దుర్గ్ పోలీస్ ఉన్నతాధికారి అభిషేక్ ఝా సోమవారం తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తామని ఆయన చెప్పారు.
Read Also: Iran: భారతీయు టూరిస్టులకు ఇరాన్ శుభవార్త.. ఇకపై వీసా లేకుండానే వెళ్లొచ్చు
Also Read
- Marriage Not License: తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేందుకు భర్త పర్మిషన్ అక్కర్లేదు.. హైకోర్టు కీలక తీర్పు
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ ఈవెంట్.. మమ్దానీపై యూఎస్ సింగర్ ఘాటు వ్యాఖ్యలు..
- Kriti Sanon: రాహుల్‌గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
- TMC Rebel MPs: 20 మంది TMC రెబల్ ఎంపీలకు షాక్.. అనర్హత పిటిషన్‌పై స్పీకర్ కీలక చర్య
బాధిత మహిళకి భిలాయ్(దుర్గ్)లోని ఖుర్సీపర్కి చెందిన వ్యక్తి ద్వారా హైదరాబాద్‌కి చెందిన ఏజెంట్ అబ్దుల్లాతో పరిచయం ఏర్పడింది. కేరళ ద్వారా ఆమెను అతను ఒమన్ పంపించినట్లు ఆమె భర్త ముఖేష్ వెల్లడించారు. ముందుగా ఏజెంట్ కేవలం తన భార్యను వంటపని చేస్తుందని చెప్పారని, ఆ తర్వాత ఇంటి పని చేయిస్తున్నారని అతను చెప్పాడు. తన భార్యను విడుదల చేసేందుకు రూ.2 లక్షల నుంచి రూ. 3 లక్షలు అడుగుతున్నాడని, నా భార్య భారత్ తిరిగి వచ్చేలా చూడాలని ప్రధాని సర్కి విజ్ఞప్తి చేస్తున్నానని అతను తెలిపాడు.
తన చిత్రహింసలపై మహిళ ఓ వీడియోను విడుదల చేసింది. అందులో ‘‘ సార్, నా పేరు దీపిక, నేను బిలాయ్‌కి చెందిన వ్యక్తి. నన్ను అబద్ధాలు చెప్పి ఇక్కడ ట్రాప్ చేశారు. నన్ను కొట్టారు. నన్ను ఇంటి నుంచి వెళ్లనివ్వాలని కోరితే, వారు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. వారు నన్ను వేరొకరికి అమ్ముతామని చెబుతున్నారు. దయచేసి నన్ను రక్షించండి సార్.’’ అంటూ తన ఆవేదనను వెల్లడించింది.
A women from Chhattisgarh allegedly claims she is held captive by her employer in Oman. She released a video saying She was thrashed and assaulted @PMOIndia @vishnudsai @MEAIndia pic.twitter.com/bGRM3zWyrv
— Anurag Dwary (@Anurag_Dwary) February 5, 2024
తాజావార్తలు
-
Marriage Not License: తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేందుకు భర్త పర్మిషన్ అక్కర్లేదు.. హైకోర్టు కీలక తీర్పు
-
Success Story: ఆ ఒక్క నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది.. IT జాబ్ వదిలి మష్రూమ్ బిజినెస్‌తో లక్షలు!
-
Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ ఈవెంట్.. మమ్దానీపై యూఎస్ సింగర్ ఘాటు వ్యాఖ్యలు..
-
Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
-
Kriti Sanon: రాహుల్‌గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..