NTV Telugu Site icon

Pushpa 2: దొంగలు కూడా ‘‘తగ్గేదే లే’’.. పుష్ప 2 సినిమా హాలులో దోపిడి..

Pushpa 2

Pushpa 2

Pushpa 2: పుష్ప-2 కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్‌గా రూ. 1000 కోట్ల మార్క్‌ని దాటేసింది. ఉత్తరాదిని పుష్ప మానియా మామూలుగా లేదు. నార్త్ ఇండియాలో థియేటర్లు హౌజ్ ఫుల్ కలెక్షన్లను సాధిస్తున్నాయి. ఇందుకేనేమో దొంగలు థియేటర్లను టార్గెట్ చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ బిలాయ్ నగరంలో ‘‘పుష్ప 2: ది రూల్’’ సినిమాని ప్రదర్శిస్తున్న థియేటర్‌లో దోపిడి జరిగింది.

Read Also: PM Modi: ఎన్నికల్లో ఓడిపోయాక అద్వానీ, వాజ్‌పేయ్ రాజ్‌కపూర్ సినిమానే చూశారు

గార్డుపై దాడి చేసిన దుండగులు, లాకర్‌ని పగలగొట్టి రూ. 1.34 లక్షలను దోపిడీ చేశారు. ఇద్దరు దుండగులు ముక్తా ఆర్ట్-2 సినిమా హాలులోని డబ్బుల్ని దోచుకెళ్లారు. సీసీటీవీ ఫుటేజ్‌ని కూడా తీసుకెళ్లారు. సినిమా హాలులోకి ప్రవేశించి డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డుపై దాడి చేసి బంధించారు. లాకర్ తాళాలు తీసుకుని ఒక లాకర్‌లోని డబ్బుల్ని తీసుకుని పరారయ్యారు.

మరుసటి రోజు ఉదయం డ్యూటీకి వచ్చిన సిబ్బంది సెక్యూరిటీ గార్డుని బంధించి ఉంచడం చూశారు. థియేటర్ మేనేజన్ దోపిడి గురించి యజమానికి సమాచారం అందించారు. దోపిడీ కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ సుఖ్ నందన్ రాథోడ్ ధ్రువీకరించారు. సెక్యూరిటీ గార్డ్ నోహర్ దేవాంగన్‌ని ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మిగిలి ఉన్న సీసీటీవీ ఫుటేజీలో ఇద్దరు వ్యక్తులు థియేటర్‌లోకి ప్రవేశిస్తున్న విజువల్స్ ఉన్నాయి. వీటి ద్వారా దొంగల్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Show comments