Site icon NTV Telugu

గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం.. వారానికి ఐదు రోజులే ప‌ని..

త‌మ రాష్ట్రంలోని ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు గుడ్‌న్యూస్ చెప్పారు ఛ‌త్తీస్‌గ‌ఢ్ ముఖ్య‌మంత్రి భూపేష్ బాఘేల్.. రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల ప‌ని దినాల‌ను త‌గ్గించ‌డంతో పాటు.. పెన్ష‌న్ ప‌థ‌కంలో త‌మ వాటాను పెంచుతున్న‌ట్టు వెల్ల‌డించారు.. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు వారానికి 5 రోజుల‌పాటు ప‌నిచేస్తే స‌రిపోతోంది.. అంతే కాకుండా.. పెన్షన్​ పథకంలో రాష్ట్రప్రభుత్వ వాటాను 10 నుంచి 14 శాతానికి పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలిపారు.

Read Also: ఒక్క‌టే స్థానం.. ఒకే పార్టీ నుంచి టికెట్ కోసం భార్యాభ‌ర్త‌ల పోటీ..!

మ‌రోవైపు, చిరువ్యాపారుల కోసం ప్రత్యేకంగా చట్టబద్ధత కల్పించే చట్టాన్ని ప్రవేశపెడుతన్నట్లు తెలిపారు సీఎం భూపేష్ బాఘేల్.. అది చిరువ్యాపారుల‌కు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని వెల్ల‌డించారు.. ఇక‌, అక్ర‌మ నిర్మాణాల అంతు తేల్చేసేందుకు సిద్ధం అవుతున్నారు.. ప్రజా భద్రతకు ఇబ్బందులు కల్గించే ఎలాంటి అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. బిల్డింగ్​ కోడ్​లోని నిబంధలను అందరు పాటించాలని స్ప‌ష్టం చేశారు.. ప్రస్తుతం మున్సిపల్​ కార్పొరేషన్​లలో సెకండ్​ బిల్డింగ్​ పర్మిషన్​ పథకానికి అనుగుణంగా ప్రణాళిక నిబంధనలు రూపొందిస్తున్నామని సీఎం ప్ర‌క‌టించారు.. అంతేకాకుండా.. రవాణా కేంద్రాలను ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు.. లెర్నింగ్​ డ్రైవింగ్​ లైసెన్స్​ జారీ నిబంధలను సులభతరం చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. మహిళల భద్రత కోసం మహిళ సేఫ్టీ సెల్స్​ను ఏర్పాటు చేస్తామని, గిరిజ‌నుల జీవ‌నోపాధి కోసం నిబంధ‌న‌ల‌ను మార్చ‌నున్న‌ట్టు తెలిపారు.

Exit mobile version