Chhangur Baba: జమాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా అరాచకాలు, దేశ వ్యతిరేక కార్యకలాపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హిందూ అమ్మాయిలు, మహిళలే టార్గెట్‌గా దేశవ్యాప్తంగా మతమార్పిడి నెట్‌వర్క్‌ని స్థాపించాడు. తనను తాను దేవుడిగా ప్రకటించుకుని, ఆ ముసుగులో అనేక అరాచకాలు చేస్తున్నాడు. ఈ కేసులో మతమార్పిడుల కోసం పలు ఇస్లామిక్ దేశాల నుంచి వందల కోట్లు నిధులను సేకరించాడు. పేద, బలహీన హిందువులను టార్గెట్ చేస్తూ, లవ్ జిహాద్ ద్వారా మత మార్పిడి చేసేందుకు వందల కోట్ల నిధుల్ని సంపాదించాడు. వీటిపై ఇప్పుడు యూపీ అధికారులతో పాటు, ఎన్ఐఏ, ఐబీ, ఈడీలు దర్యాప్తు చేస్తున్నాయి.
Read Also: Netanyahu: అమెరికా టూర్ తర్వాత నెతన్యాహు కొత్త ఎత్తుగడ! ఈ వారంలోనే ప్లాన్ అమలు
ఇదిలా ఉంటే, ఛంగూర్ బాబా పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI)తో సంబంధాలను బలోపేతం చేయడానికి ఖాట్మండుకు వెళ్లినట్లు తెలుస్తోంది. మాత మార్పిడులతో పాటు దేశవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. సోర్సెస్ ప్రకారం, ఇస్లాం మతంలోకి మారిన హిందూ మహిళలను నేపాల్‌లోని ఐఎస్ఐ ఏజెంట్లు, స్లీపర్ సెల్ ఆపరేటివ్స్‌లతో వివాహం చేయాలని ఛంగూర్ బాబా భావించాడు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, బీహార్, పశ్చిమ బెంగాల్ మరియు ఉత్తరప్రదేశ్‌లోని వివిధ జిల్లాలతో సహా అనేక భారతీయ రాష్ట్రాలలో మత మార్పిడి నెట్‌వర్క్ వ్యాపించిందని ఆరోపణలు ఉన్నాయి. ఇస్లామిక్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (సౌదీ అరేబియా), ముస్లిం వరల్డ్ లీగ్, దావత్-ఎ-ఇస్లామి, ఇస్లామిక్ యూనియన్ ఆఫ్ నేపాల్ వంటి అంతర్జాతీయ ఇస్లామిక్ సంస్థలతో కూడా చంగూర్‌కు సంబంధాలు ఉన్నాయని చెబుతారు.
ఇటీవల పాకిస్తాన్ ఐఎస్ఐ సమావేశం ఖాట్మాండులోని పాక్ రాయబార కార్యాలంలో జరిగినట్లు సమాచారం. దీనికి పలువురు కీలక ఐఎస్ఐ అధికారులు హజరయ్యారు. పాక్ బృందం నేపాల్-భారత్ సరిహద్దు ప్రాంతాన్ని కూడా సందర్శించింది. ఇదిలా ఉంటే, ఛంగూర్ బాబా, ఉత్తర్ ప్రదేశ్‌లోని బర్హ్నిలో ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసి, రోహింగ్యా శరణార్థులను హిందువులగా చూపించి, ఆ తర్వాత మతం మార్చే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
