Site icon NTV Telugu

Maharashtra: ఫడ్నవిస్ కేబినెట్‌లోకి 77 ఏళ్ల కురు వృద్ధుడు.. నేడు ప్రమాణం చేయనున్న భుజ్‌బాల్

Maharashtra

Maharashtra

మహారాష్ట్ర కేబినెట్‌లో మంగళవారం ఒక కీలక పరిణామం జరగనుంది. దేవేంద్ర ఫడ్నవిస్ మంత్రివర్గంలో ఎన్‌సీపీకి చెందిన 77 ఏళ్ల రాజకీయ కురు వృద్ధుడు ఛగన్ భుజ్‌బాల్ చేరనున్నారు. ఉదయం 10 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్.. ఛగన్ భుజ్‌బాల్‌ చేత ప్రమాణం చేయించనున్నారు. భుజ్‌బాల్.. అనేక దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. పలు ముఖ్యమంత్రుల దగ్గర పని చేసిన అనుభవం ఉంది. డిసెంబర్‌లో ఫడ్నవిస్ కేబినెట్‌లో భుజ్‌బాల్ మిస్ అయ్యారు. దాదాపు 5 నెలల తర్వాత భుజ్‌బాల్ ఫడ్నవిస్ కేబినెట్‌లో చేరుతున్నారు.

ఇది కూడా చదవండి: LSG vs SRH: అభిషేక్ శర్మ, దిగ్వేష్ రాఠి మధ్య గొడవ.. తీరు మార్చుకోని దిగ్వేష్

మంత్రివర్గంలో చేరుతున్నట్లు భుజ్‌బాల్ ప్రకటించారు. చాలా కాలం తర్వాత తిరిగి మంత్రిపదవి చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే మహాయుతి కూటమి కూడా ఈ వార్తను ధృవీకరించింది. భుజ్‌బాల్ ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తి. డిసెంబర్‌లో భుజ్‌బాల్‌ను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంతో ఆ వర్గ ప్రజల్లో తీవ్ర నిరాశ ఎదురైంది. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను గమనించిన ఫడ్నవిస్ కేబినెట్‌లోకి తీసుకుంటున్నారు. నాసిక్ జిల్లాలోని యోలా ఎమ్మెల్యే అయిన భుజ్‌బాల్.. వివిధ ప్రభుత్వాల్లో డిప్యూటీ సీఎంతో పాటు కేబినెట్ మంత్రిగా పని చేశారు. భుజ్‌బల్‌కు పోర్ట్‌ఫోలియో కేటాయింపునకు సంబంధించిన నిర్ణయం ముఖ్యమంత్రిదేనని, ప్రమాణ స్వీకార కార్యక్రమం తర్వాత ప్రకటిస్తారని వర్గాలు తెలిపాయి.

ఇది కూడా చదవండి: Rakul preet singh : దానికి వయసుతో సంబంధం లేదు..

భుజ్‌బాల్.. మహారాష్ట్రకు చెందిన నాయకుడు. 1947న అక్టోబర్ 15న జన్మించారు. యోలా నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 18 అక్టోబర్ 1999 నుంచి 23 డిసెంబర్ 2003 వరకు మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా పని చేశారు. 28 నవంబర్ 2019 నుంచి 29 జూన్ 2022 వరకు ఉద్ధవ్ థాక్రే మంత్రివర్గంలో ఆహార, పౌర సరఫరా, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రిగా పని చేశారు.

Exit mobile version