కరోనా ఎఫెక్ట్‌తో స్కూళ్లు, కాలేజీలు.. ఇలా ఒక్కటేంటి.. విద్యాసంస్థలు మొత్తం మూసివేశారు.. ఇప్పుడు అంతా ఆన్‌లైనే.. చదువునే ప్రాంతాల్లో గతంలో.. కొందరు కీచక టీచర్లు చేసే వెకిలి చేష్టలు.. ఇళ్లలో విద్యార్థినులు ఫిర్యాదు చేయడం.. పేరెంట్స్ వచ్చి దేహశుద్ధిచేసిన ఘటనలు చాలా ఉన్నాయి.. కానీ, ఆన్‌లైన్ క్లాసుల్లోనే ఇలాంటి కీచకలు ఉండనే ఉన్నారు.. తమిళనాడులో ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు నిర్వాకంపై విద్యార్థులు, డీెంకే ఎంపీ కనిమోళి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పీఎస్‌బీబీ స్కూల్‌లో రాజగోపాల్ అనే వ్యక్తి టీచర్‌గా పనిచేస్తున్నాడు.. ఆన్ లైన్ క్లాసులకు చిన్నపాటి టవల్ కట్టుకొని క్లాసులు చెబుతున్నారు రాజగోపాల్… యువతులకు క్లాసులు చెబుతూ మధ్యలో టవల్ తొలగిస్తూ.. అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.. అంతేకాదు.. ఆన్‌నైన్ క్లాసుల సమయంలో.. నీలి చిత్రాలను విద్యార్థులకు చూపుతూ.. విద్యార్థినుల వాట్సాప్ నంబర్లకు భూతులు, నీలి చిత్రాలకు సంబంధించిన వీడియోలు పంపుతూ .. అవి ఎలా ఉన్నాయో చెప్పాలంటూ మేసేజ్ లు పెడుతున్నాడు.. అయితే, రాజగోపాల్ చేష్టలను కొంతకాలం మౌనంగా భరించిన విద్యార్థినులు.. ఆ తర్వాత అతడిపై చర్యలు తీసుకోవాలంటూ పోరాటం మొదలు పెట్టారు.. సోషల్ మీడియా వేదికగా విద్యార్థుల పోరాటం మరింత విస్తృతంగా సాగింది.. దీంతో.. విద్యార్థుల పోరాటంపై స్పందించిన డీఎంకే ఎంపీ కనిమోళి.. రాజగోపాల్‌పై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి లేఖరాశారు.