TVK Vijay: తమిళనాడులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కరూర్ లో ఏర్పాటు చేసిన టీవీకే బహిరంగ లో జరిగిన తొక్కిసలాటలో సుమారు 39 మంది మరణించగా, 111 మంది తీవ్రంగా గాయపడి స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే, ఈ ఘటన మరిచిపోక ముందే టీవీకే చీఫ్ విజయ్ కి సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also: 50MP క్వాడ్ కెమెరా లెన్స్, 7000mAh బ్యాటరీ, OLED డిస్‌ప్లే, కూలింగ్ సిస్టమ్‌తో వచ్చేసిన Xiaomi 17
అయితే, హీరో విజయ్ వ్యవహారంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. నిన్న ( సెప్టెంబర్ 27న) చెన్నై నుంచి తిరుచ్చి చేరుకుని రోడ్డు మార్గాన కరూర్ వస్తున్న సమయంలో బైక్ పై నుంచి విజయ్ బస్సు కిందపడిన కార్యకర్తలు.. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. అలాగే, తొక్కిసలాట జరిగి కార్యకర్తలు కుప్పకూలి, రోడ్డు మీద పడి ఉన్న సమయంలోనూ తన ప్రసంగాన్ని విజయ్ కొనసాగించారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున అరవడంతో పాటు పార్టీ జెండాలను బస్సుపై విసరడంతో జరిగిన విషయాన్ని విజయ్ కి టీవీకే సభ్యులు తెలియజేశారు. ఈ రెండు ఘటనలు జరిగిన ఎక్కడ కార్యకర్తలను టీవీకే పార్టీ చీఫ్ విజయ్ పరామర్శించక పోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
