NTV Telugu Site icon

Manmohan Singh Cremation: పీవీకి మీరు చేసింది ఏమిటి..? కాంగ్రెస్‌‌వి చిల్లర రాజకీయాలు..

Manmohan Singh Cremation Row

Manmohan Singh Cremation Row

Manmohan Singh Cremation: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిసినా, వివాదం మాత్రం చల్లారడం లేదు. మన్మోహన్ సింగ్‌కి బీజేపీ ప్రభుత్వం గౌరవం ఇవ్వలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. స్మారక చిహ్నం విషయంలో అవమానపరించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆయన దహన సంస్కారాలు రాజ్‌ఘాట్‌లో కాకుండా ఢిల్లీలోని నిగంభోద్ ఘాట్‌లో నిర్వహించడంపై కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు ఎక్కు పెట్టింది.

Read Also: Manohar Rao: సోనియా గాంధీ కనీసం అంత్యక్రియలకు హాజరు కాలేదు: పీవీ నరసింహారావు సోదరుడు

ఇదిలా ఉంటే, ఈ ఆరోపణలపై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పందించారు. మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో ఏ వివాదం లేదన, అయితే కాంగ్రెస్ కావాలనే వివాదం చేస్తూ చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. అంత్యక్రియలకు నిర్దిష్ట ఏర్పాట్లు చేయాలని కోరుతూ కాంగ్రెస్ రాసిన లేఖ ఆలస్యంగా తమకు వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్మారక చిహ్నం నిర్మించాలని కోరడంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అంగీకరించిందని చెప్పారు. నిగంబోధ్‌లో అంత్యక్రియలు నిర్వహించడానికి లాజిస్టిక్ కారణాలు ఉన్నాయని, ఆ రోజు ఢిల్లీలో భారీ వర్షం కురిసినట్లు ఆయన చెప్పారు.

1991లో భారతదేశాన్ని ఆర్థికంగా పటిష్టం చేసిన పీవీ నరసింహరావుకి కాంగ్రెస్ చేసింది ఏమిటని పూరీ ప్రశ్నించారు. ఆయన 2004లో మరణించిన సమయంలో కాంగ్రెస్ ఢిల్లీలో అంత్యక్రియలకు కూడా అనుమతించలేదని, హైదరాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చిందని గుర్తు చేశారు. మోడీ ప్రధాని అయిన తర్వాతే ఢిల్లీలో ఆయన స్మారకం ఏర్పాటు చేశామని చెప్పారు. మన్మోహన్ సింగ్ చితాభస్మం ఈరోజు యమునా నదిలో కలిపిన సమయంలో గాంధీ కుటుంబానికి చెందిన ఒక్కరు కూడా రాలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ బేరర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనలేదని అన్నారు

Show comments