Bibek Debroy: ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ బిబేక్ దేబ్రోయ్ కన్నుమూత
- తుదిశ్వాస విడిచిన పీఎం ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ బిబేక్ దేబ్రోయ్..
- సంతాపం తెలిపిన ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bibek Debroy: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆర్థిక సలహా మండలి ఛైర్మన్, ఆర్థిక వేత్త బిబేక్ దేబ్రోయ్ (69)ఈ రోజు (శుక్రవారం) కన్నుమూశారు. పేగు సంబంధిత సమస్యతో దేబ్రోయ్ మృతి చెందినట్లు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. బిబేక్ దేబ్రోయ్ రామకృష్ణ మిషన్ స్కూల్ (నరేంద్రపూర్), ప్రెసిడెన్సీ కాలేజీ (కోల్‌కతా), ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ట్రినిటీ కాలేజీ (కేంబ్రిడ్జ్)లో విద్యాభ్యాసం చేశాడు. ఆయన ప్రెసిడెన్సీ కాలేజీ (కోల్‌కతా), గోఖలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ (పూణే), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఢిల్లీ)లో విధులు నిర్వహించారు. ఇక, ప్రముఖ ఆర్థికవేత్త బిబేక్ దేబ్రోయ్‌ను భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.
Read Also: SK : తమిళనాడు నెక్ట్స్ సూపర్ స్టార్ గా శివ కార్తికేయన్..?
Also Read
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
- Agni-4 Ballistic Missile: పాకిస్తాన్ మొత్తం భారత పరిధిలో.. అగ్ని-4 మిస్సైల్ సక్సెస్..
కాగా, బిబేక్ దేబ్రోయ్ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రగాఢ సంతాపం తెలిపారు. డాక్టర్ బిబేక్ తెలివైన పండితులు, ఆర్థిక శాస్త్రం, చరిత్ర, సంస్కృతి, రాజకీయాలు, ఆధ్యాత్మికం లాంటి విభిన్న రంగాలలో ఆయనకు మంచి ప్రావీణ్యం ఉందని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ పోస్టులో పేర్కొన్నారు. తన మేధో సంపత్తి, రచనల ద్వారా భారతదేశంపై చెరగని ముద్ర వేశారని గుర్తు చేశారు. ప్రజా విధానానికి ఆయన చేసిన కృషితో పాటు ప్రాచీన గ్రంథాలపై బిబేక్ దేబ్రోయ్ పని చేయడం.. వాటిని యువకులకు అందుబాటులో ఉంచడం గొప్ప విశేషమని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు.
Dr. Bibek Debroy Ji was a towering scholar, well-versed in diverse domains like economics, history, culture, politics, spirituality and more. Through his works, he left an indelible mark on India’s intellectual landscape. Beyond his contributions to public policy, he enjoyed… pic.twitter.com/E3DETgajLr
— Narendra Modi (@narendramodi) November 1, 2024
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!