Parliament: ప్రతిపక్ష ఎంపీలపై రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖర్ సీరియస్ అయ్యారు. సభా నియమాలను, సభా హక్కులను ఉల్లంఘించారనే ఆరోపణల నేపథ్యంలో 12 మంది ప్రతిపక్ష ఎంపీల పేర్లను రాజ్యసభ ప్రివిలేజెస్ కమిటీకి సిఫారసు చేశారు. ఇందులో 9 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండగా, ముగ్గురు ఆప్ ఎంపీలు ఉన్నారు. కమిటీ పరిశీలించి, దర్యాప్తు చేసి నివేదికను సమర్పించాలని జగ్‌దీప్ ధన్‌ఖర్ ఆదేశించారు. దీనికి అనుగుణంగా ఎంపీలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Read Also: Pakistan Economic Crisis: పాక్ ప్రజలపై పన్నుల మోత.. లగ్జరీ వస్తువుల, దిగుమతులపై భారీగా పన్నులు
కాంగ్రెస్, ఆప్ ఎంపీలు కొందరు అక్రమంగా ప్రవర్తించారని.. పదే పదే సభ వెల్ లోకి ప్రవేశిండచం, నినాదాలు చేయడం వంటివి చేసి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారని ఆరోపణలు రావడంతో రాజ్యసభ చైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. విచారణ ఎదుర్కోబోయే కాంగ్రెస్ ఎంపీలు వీరే..శక్తిసిన్హ్ గోహిల్, నారన్‌భాయ్ జె రథ్వా, సయ్యద్ నాసిర్ హుస్సేన్, కుమార్ కేత్కర్, ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి, ఎల్ హనుమంతయ్య, ఫూలో దేవి నేతమ్, జెబి మాథర్ హిషామ్ మరియు రంజీత్ రంజన్. ఆప్ ఎంపీల్లో సంజయ్ సింగ్, సుశీల్ కుమార్ గుప్తా మరియు సందీప్ కుమార్ పాఠక్ ఉన్నారు.