సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ఏదో న్యూసో.. ఏదో ఫేకో కూడా తెలియని పరిస్థితి.. ఇదే అదునుగా కొందరు కేటుగాళ్లు.. దేశానికి విరుద్ధమైన ఫేక్ న్యూస్‌ను సోషల్ మీడియాలో పెట్టడం.. దానిని వైరల్ చేసి.. పరువు తీస్తున్నారు.. అయితే, వారి సంగతి తేల్చే పనిలో పడిపోయింది కేంద్రం.. భారత్‌కు విరుద్ధంగా తప్పుడు ప్రచారం చేస్తున్న పాకిస్థాన్ ఆధారిత యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేసింది.. సుమారు 35 యూట్యూబ్ ఛానళ్లను బ్యాన్ చేసింది భారత సర్కార్. ఈ బ్లాక్ చేసిన ఛానళ్ల కంటెంట్ విషయానికి వస్తే భారత సాయుధ బలగాలు, కాశ్మీర్, భారత్ విదేశీ సంబంధాలు, మాజీ సీడీఎస్ బిపిన్ రావత్ మరణం వంటి విషయాలపై ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేస్తోంది.. దీంతో.. ఆ ఛానళ్లపై నిషేధం విధిస్తున్నట్టు భారత సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది.. ఇక, ఇదే సమయంలో రెండు ట్విట్టర్ ఖాతాలు, రెండు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు, రెండు వెబ్‌సైట్లు, ఒక ఫేస్‌బుక్ ఖాతాను కూడా బ్లాక్ చేసింది.