Prajwal Revanna Scandal: గత నెలలో కర్ణాటకలో జేడీఎస్ మాజీ నేత, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ టేపుల వ్యవహారం రాజకీయంగా సంచలనంగా మారింది. ముఖ్యంగా రేవణ్ణ ఫ్యామిలీకి పట్టున్న హసన్ జిల్లాలో ఈ సెక్స్ వీడియోలు వైరల్‌గా మారాయి. రేవణ్ణ ఇంట్లో పనిచేస్తున్న 47 ఏళ్ల మహిళ ప్రజ్వల్ రేవణ్ణతో పాటు ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణపై లైంగిక ఆరోపణలతో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం తర్వాత ప్రజ్వల్ రేవణ్ణ ఇండియా నుంచి జర్మనీ పారిపోయాడు. ఈ కేసును విచారించేందుకు సిట్ ఏర్పాటు చేసిన కర్ణాటక ప్రభుత్వం, అతడికి పలుమార్లు నోటీసులు జారీ చేసింది.
Read Also: Shocking: బిడ్డ లింగ నిర్ధారణ కోసం భార్య కడుపు చీల్చిన కసాయి భర్త..
తాజాగా సీఎం సిద్ధరామయ్య ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్టు రద్దు చేయాలని లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కేంద్రం చర్యలు మొదలు పెట్టింది. ప్రజ్వల్ రేవణ్ణకు శుక్రవారం విదేశాంగ మంత్రిత్వ శాఖ ‘షోకాజ్’ నోటీసులు జారీ చేసింది. సిద్ధరామయ్య లేఖ తర్వాత కేంద్రం నుంచి ఈ నోటీసులు వచ్చాయి. జర్మనీకి పారిపోయిన ప్రజ్వల్ రేవణ్ణను ఇండియా తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను తీవ్రతరం చేసింది. శుక్రవారం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. మే 21న ప్రజ్వల్ రేవణ్ణ డిప్లామాట్ పాస్‌పోర్టు రద్దుకు సంబంధించిన అభ్యర్థనను స్వీకరించిందని, దానిని పరిశీలిస్తు్న్నట్లు చెప్పారు.