NTV Telugu Site icon

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. ఆ కేసులో విచారణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Arvindh

Arvindh

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మనీ లాండరింగ్‌ కేసులో మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. కేజ్రీవాల్ ను విచారించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రజా ప్రతినిధుల్ని విచారించేందుకు ఈడీ ముందస్తు పర్మిషన్ పొందాలని సుప్రీంకోర్టు గత నవంబర్‌లో ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తాజాగా ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా కేజ్రీవాల్‌ను విచారణ చేసేందుకు ఓకే చెప్పడంతో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Read Also: Hyderabad: రాచకొండ పరిధిలో గన్స్ విక్రయం.. మూడు తుపాకులు స్వాధీనం..

అయితే, 2021-22కి సంబంధించి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై అరవింద్ కేజ్రీవాల్‌పై కేసు నమోదైంది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి 2024 మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేయగా.. 6 నెలల పాటు తీహార్ జైలులో శిక్ష అనుభవించిన తర్వాత 2024 సెప్టెంబర్లో అతడికి సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. బెయిల్ పొందిన కొద్ది రోజులకే, కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం పదవికీ రాజీనామా చేశారు. అతడి స్థానంలో అతిషి మార్లెనా సింగ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

Read Also: Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

కాగా, ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ నియోజవర్గాలకు ఫిబ్రవరి 5వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు, తుది ఫలితాలను ఈసీ ప్రకటించనుంది. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు అధికార, విపక్ష పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొంది. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 62 సీట్లలో విజయం సాధించగా.. బీజేపీ కేవలం 8 సీట్లు మాత్రమే గెలవగా.. కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది.

Show comments