Site icon NTV Telugu

Ashwini Vaishnaw: ఎన్నికల ముందు బీహార్‌పై వరాలు.. రూ.2వేల కోట్లతో రైల్వే ప్రాజెక్ట్‌లకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

Ashwinivaishnaw

Ashwinivaishnaw

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇక అధికారం కోసం ఎన్డీఏ, ఇండియా కూటమి పక్షాలు తీవ్రంగా శ్రమిస్తు్న్నాయి. నువ్వానేనా? అన్నట్టుగా బరిలోకి దిగబోతున్నాయి. ఇక మరోసారి అధికారం కోసం ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అంతేకాకుండా ఇప్పటికే పలుమార్లు ప్రధాని మోడీ పర్యటించారు.

ఇది కూడా చదవండి: HBD Sourav Ganguly: డేరింగ్ కేర్ ఆఫ్ సౌరవ్ గంగూలీ.. టీమిండియా తలరాతనే మార్చిన బెంగాల్ టైగర్..!

ఇక తాజాగా కేంద్రం బీహార్‌పై వరాల జల్లు కురిపించింది. బీహార్ రైల్వే అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. బీహార్‌కు 4 కొత్త అమృత్ భారత్ ట్రైన్లు నడపబోతున్నట్లు చెప్పారు. రూ.2000 కోట్లతో కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 104 కిలోమీటర్ల బక్తియార్పూర్ – రాజ్‌గిర్ – తిలైయా రైలు మార్గ డబులింగ్‌కు నిధులు మంజూరు చేశారు. ఈ రైలు మార్గ విస్తరణతో ప్రయాణికులకు లాభం జరగనుంది. ఇక స్థానికులకు కూడా ఉపాధి దొరకనుంది.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy : సీఎం రేవంత్‌ తో అజయ్ దేవగణ్ భేటీ.. తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ఫిల్మ్ స్టూడియో..!

ఇక తాజాగా బీహార్ ఎన్నికలపై ఆయా సంస్థలు చేసిన సర్వేలు బయటకు వస్తున్నాయి. ఇంక్‌ఇన్‌సైట్ విడుదల చేసిన అభిప్రాయ సేకరణ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ సర్వేలో మరోసారి అధికార ఎన్డీఏకే ప్రజలు పట్టం కడుతున్నట్లు తెలిపింది. దాదాపు 48.9 శాతం మంది ఎన్డీఏకు మద్దతు ఇచ్చారు. బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నవంబర్-డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.

Exit mobile version