NTV Telugu Site icon

Arunachal Pradesh: సరిహద్దుల్లో చైనాకు ధీటుగా భారత్ అభివృద్ధి పనులు

China Border

China Border

Centre Clears Construction Of 6 Corridors In Arunachal Near China Border: భారత-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు అలాగే ఉన్నాయి. భారత్ ను ఇరుకునపెట్టేందుకు ఇప్పటికే చైనా కొత్త గ్రామాలను, రోడ్డు, ఎయిర్ స్ట్రిప్స్, ఎయిర్ బేసులను నిర్మించింది. గల్వాన్ ఘర్షణల అనంతరం చైనా తన సైనిక నిర్మాణాలను పెంచుకుంటూ పోతోంది. ఇదిలా ఉంటే భారత్ కూడా చైనాకు ధీటుగా సరిహద్దుల్లో మౌళిక నిర్మాణాలను చేపడుతోంది. అరుణాచల్ ప్రదేశ్ మొదలుకుని చైనాతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాల్లో రోడ్లు, వంతెనలను నిర్మిస్తోంది. ఉద్రిక్తతల సమయంలో సైన్యాన్ని, ఆయుధ వ్యవస్థలను వేగంగా తరలించేందుకు రోడ్లను నిర్మిస్తోంది.

జాతీయ రహదారి-15, అరుణాచల్ ప్రదేశ్ లో ఫ్రాంటియర్ హైవేలకు కేంద్ర పచ్చ జెండా ఊపింది. చైనాకు సరిహద్దులో ఉన్న భారత ప్రాంతాలను కలిపేందుకు, రహదారి కనెక్టవిటీని మెరుగుపరిచేందుకు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ రూ. 2,178 కిలోమీటర్ల పొడవైన ఆరు కారిడార్లను నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ రోడ్ల ద్వారా సైనిక సామాగ్రిని వేగంగా చైనా సరిహద్దుల్లో మోహరించే అవకాశం ఏర్పడుతుంది.

Read Also: Madya Pradesh Bus Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది దుర్మరణం

సరిహద్దుల వరక మూడు కీలక రహదారులను విస్తరించనున్నారు. ఇటాఖోలా-సీజోసా-పక్కే కెస్సాండ్- సెప్పా చయాంగ్తాజో- సాంగ్గ్రామ్-పార్సీ పార్లో వరకు 391 కిలోమీటర్లు, కనుబారి -లాంగ్డింగ్ వరకు 404 కిలోమీటర్లు, అకాజాన్-పాంగో జార్జింగ్ మధ్య 398 కిలోమీటర్లు, గోగముఖ్ తహిలా టాటో వరకు 285 కిలోమీటర్ల దూరం, తెలమార- తవాంగ్- నీలియా (సరిహద్దు) వరకు 402 కిలోమీటర్లు, పాసిఘాట్ బిషింగ్ (సరిహద్దు) వరకు 298 కిలోమీటర్లు ఇలా ఆరు కారిడార్లను అభివృద్ధి చేయనున్నారు.

అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతం చైనాలో భాగం అని చాలా రోజులుగా చైనా వాదిస్తోంది. దీంతో ఈ ప్రాంతంపై చైనా బలగాల కన్ను ఉంది. దీంతో ఈ రాష్ట్ర సరిహద్దుల్లో చైనా గ్రామాలను కూడా నిర్మిస్తోంది. దీంతో భారత్ ప్రభుత్వం కూడా చైనా దుందుడుకు చర్యలకు చెక్ పెట్టే విధంగా సైనిక మౌళిక సదుపాయాలను పెంచుకుంటోంది. అయితే భారత్ లఢఖ్, అరుణాచల్ ప్రదేశ్ లోచేపడుతున్న నిర్మాణాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇవి ఉద్రిక్తతలను పెంచే విధంగా ఉన్నాయంటూ గగ్గోలు పెడుతోంది. అయితే తను మాత్రం ఎంచక్కా నిర్మాణాలు చేపడుతూ పోతోంది.