NTV Telugu Site icon

సెంట్ర‌ల్ విస్టా ప్రాజెక్టు ఆపేదిలేదు.. పిటిష‌న‌ర్‌కు హైకోర్టు జ‌రిమానా

Central Vista

సెంట్ర‌ల్ విస్టా ప్రాజెక్టుపై కీల‌క వ్యాఖ్య‌లు చేసింది ఢిల్లీ హైకోర్టు.. సెంట్ర‌ల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణ ప‌నుల‌ను ఆపే ప్ర‌స‌క్తే లేద‌ని స్ప‌ష్టం చేసింది.. ఇది చాలా ముఖ్య‌మైన జాతీయ ప్రాజెక్టు అని ఈ సంద‌ర్భంగా వ్యాఖ్యానించింది. క‌రోనా సెకండ్ వేవ్ నేప‌థ్యంలో.. సెంట్ర‌ల్ విస్టా ప‌నుల‌ను ఆపాలంటూ దాఖ‌లైన పిల్‌పై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు.. ఇది ఉద్దేశ‌పూర్వ‌కంగా వేసిన పిటిష‌న్ త‌ప్ప పిల్ కాదని పేర్కొంది.. అంతేకాదు పిటిష‌నర్ల‌కు రూ.ల‌క్ష‌ల జ‌రిమానా కూడా విధించింది. సంబంధిత డీడీఎంఏ ఆదేశాల గురించి కోర్టు ప్ర‌స్తావిస్తూ.. ప‌నులు నిషేధించాల్సిందిగా అందులో ఎక్క‌డా లేద‌ని స్ప‌ష్టం చేసింది.. మొత్తంగా ఆ పిటిష‌న్‌ను తిర‌స్క‌రించింది హైకోర్టు.