NTV Telugu Site icon

Kishan Reddy: మోడీ సర్కార్ వారి పాట.. బహుమతుల వేలంలో వచ్చిన నిధులు నమామి గంగకే..

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక కొత్త మార్గదర్శనం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. ప్రధానిగా ఎన్నో ప్రదేశాలు పర్యటిస్తారని, ఎందరో ప్రధానిని కలుస్తుంటారు.. ఈ సమయంలో ప్రధానికి గౌరవంగా బహుమతులు ఇస్తుంటారని ఆయన తెలిపారు. దేశ చరిత్రలో మొదటిసారి ప్రధాని మోడీ ఆ బహుమతులన్నింటిని మళ్లీ దేశం కోసం వెనక్కి ఇస్తున్నారని చెప్పారు.

ఓ చిన్నారి మోడీ వేసుకున్న శాలువా కావాలని గతంలో లేఖ రాసిందని.. స్పందించిన ప్రధాని శాలువాను చిన్నారికి పంపించారన్నారు. 2019 నుంచి ప్రతియేటా బహుమతుల వేలం జరుగుతోందన్న కిషన్‌రెడ్డి.. ఈ సారి 1222 బహుమతులకు వేలం జరుగుతోందన్నారు. 2.7 కోట్ల సర్కార్ వారి పాట అంటే కనీస ధర అని ఆయన అన్నారు. 25 బహుమతులు క్రీడాకారులు ఇచ్చినవి ఉన్నాయన్నారు.

Delhi Excise Policy: ఢిల్లీ మద్యం కేసులో దూకుడు పెంచిన ఈడీ.. 4 రాష్ట్రాల్లో కొనసాగుతున్న దాడులు

అయోధ్య రామమందిరం బహుమతితో పాటు వారణాసి కాశీ విశ్వనాథ ఆలయం నమూనా గిఫ్ట్ కూడా ఉందన్నారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విగ్రహం కూడా వేలంలో ఉందన్నారు. వేలం ద్వారా వచ్చిన నిధులను నవామి గంగ కోసం కేటాయిస్తామని ఆయన ప్రకటించారు. విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా వేలంలో పాల్గొనవచ్చన్నారు. గతేడాది బహుమతుల వేలం ద్వారా 15.7 కోట్ల రూపాయలు సమకూరాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

Show comments