KIshanReddy: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో కిషన్ రెడ్డి భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జి.కిషన్ రెడ్డి బుధవారం బంగ్లాదేశ్ ప్రధానమంత్రిషేక్ హసీనాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈశాన్య భారతం-బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సంబంధించిన వివిధ అంశాలపై వీరిద్దరూ చర్చించారు. ఈశాన్య రాష్ట్రాలతో వాణిజ్య సంబంధాలను మెరుగు పరుచుకోవడం ద్వారా ఇరుదేశాల్లో వివిధ అంశాల్లో సానుకూల ఫలితాలకు ఆస్కారం ఉంటుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. బార్డర్ హాట్స్, ఇంటిగ్రేటెడ్ చెక్ పాయింట్స్, ల్యాండ్ కస్టమ్ స్టేషన్స్ వ్యవస్థలను బలోపేతం చేయడం వంటి చర్యల ద్వారా సరిహద్దు వాణిజ్యానికి మరింత ఊతం లభిస్తుందనే అంశాన్ని ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి దృష్టికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీసుకొచ్చారు.
ఇరుదేశాల మధ్య వివిధ అనుసంధాన మార్గాలను (మల్టీ-మోడల్ కనెక్టివిటీ) అమలుచేయాల్సిన అవసరం ఉందని అప్పుడే ఇరుదేశాల మధ్య వివిధ రంగాల్లో పరస్పర అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. విద్యుత్, వ్యవసాయం, తేయాకు ఎగుమతికి బంగ్లాదేశ్ రేవుల సహకారం, పర్యాటకం తదితర రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు అవసరమైన విషయాలను కూడా ఈ సందర్భంగా ఇరువురు నేతలు చర్చించారు. దీనికి సంబంధించి తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణను పరిశీలించవలసిందిగా బంగ్లాదేశ్ ప్రధానిని కిషన్ రెడ్డి కోరారు.
Also Read
- Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
- PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
- King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్‌కు రూ. 22 కోట్ల నోటీసు జారీ

షేక్ హసీనా సమక్షంలో ఇరుదేశాల పారిశ్రామిక వేత్తల సదస్సు (సీఈవో కాన్ఫరెన్స్)ను ఉద్దేశించి కిషన్ రెడ్డి ప్రసంగించారు. ఈశాన్య భారతం అభివృద్ధి కోసం శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా ఆయా రాష్ట్రాల్లో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇరుదేశాల మధ్య అనుసంధానత తదితర అంశాలకు పుష్కలమైన అవకాశాలున్నాయన్నారు.
Read Also: Bandi Sanjay: రాజ్యాంగబద్ద పదవిలో ఉంటూ రాజకీయ విమర్శలా?
విశ్రాంతి పర్యాటకం, వైద్య పర్యాటకం, విద్య, సాంస్కృతిక మార్పిడి తదతర అంశాల్లో ఈశాన్య రాష్ట్రాలు, బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవచ్చన్న కిషన్ రెడ్డి.. ఈశాన్య భారతంలోని విస్తృత అవకాశాలను అందిపుచ్చుకోవాలని సీఈవోలకు సూచించారు. ఈమేరకు పెట్టుబడి దారులు, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించిన కిషన్ రెడ్డి, తమ ప్రభుత్వం తరఫున అన్ని అంశాల్లోనూ సంపూర్ణ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని శ్రీమతి షేక్ హసీనాల నేతృత్వంలో ద్వైపాక్షిక సత్సంబంధాల స్వర్ణయుగం ప్రారంభమైందని, దీన్ని వాణిజ్యవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
తాజావార్తలు
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
-
Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
-
Kalma Homework: స్కూల్లో ‘కల్మా’ హోంవర్క్ వివాదం.. బీజేపీ నేతల ఆగ్రహం..!
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!