NTV Telugu Site icon

IMD BIG Alert: పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ.. అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్

Imdalert

Imdalert

దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని జిల్లాలు జలదిగ్భందంలో చిక్కుకుని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్షలాది మంది నిరాశ్రయులై.. శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. తాజాగా కేంద్ర వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తాజాగా వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

ఇది కూడా చదవండి: BV Raghavulu: బీజేపీది ధృతరాష్ట్ర కౌగిలి.. టీడీపీ, జనసేనలు జతకట్టడం సరికాదు..

దేశంలో రుతుపవనాలు విస్తరంగా వ్యాపించాయి. ఈ ప్రభావంతో సోమ, మంగళవారాల్లో గుజరాత్, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. దీంతో ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే వచ్చే నాలుగు రోజుల పాటు తెలంగాణ, మధ్యప్రదేశ్, ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక ఉత్తరాఖండ్‌లో అయితే తేలికపాటి వర్షం కురిసే ఛాన్సుందని పేర్కొంది.

ఇది కూడా చదవండి: NASA: ” అంతరిక్షంలో పెంగ్విన్ తన గుడ్డును కాపాడుకుంటోంది..!” నాసా విడుదల చేసిన గ్యాలెక్సీల చిత్రాలు..

ఇక ముంబైలో భారీ వర్షపాతం నమోదైంది. జూలై నెలలో ఇప్పటికే వెయ్యి మిల్లీమీటర్ల మార్కు దాటింది. గత 15 ఏళ్లలో జూలైలో ఇంత వర్షపాతం నమోదవ్వడం ఇదే తొలిసారి. మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా అలీబాగ్ నుంచి పన్వెల్ వెళ్తున్న ఎంఎస్‌ఆర్‌టీసీ బస్సు బోల్తా పడింది. బస్సులో 45 నుంచి 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు గాయపడగా.. వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.