NTV Telugu Site icon

Constitution Day: నేడే భారత రాజ్యాంగ దినోత్సవం.. రాష్ట్రపతి ముర్ము అధ్యక్షతన వేడుకలు

Const

Const

Constitution Day: భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి నేటికి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక వెబ్‌సైట్‌ ( https: //constitution75.com)ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో రాజ్యాంగ పరిషత్ చర్చలు, నివేదికలు అందుబాటులో ఉంటాయని కేంద్ర సాంస్కృతిక శాఖ చెప్పుకొచ్చింది. నవంబర్ 26 నుంచి ఏడాది పొడవునా ఈ వేడకలు నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే, ఈరోజు (మంగళవారం) పాత పార్లమెంటు భవనంలోని సంవిధాన్‌ సదన్‌ సెంట్రల్‌ హాల్‌లో జరిగే 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు రాష్ట్రపతి దౌప్రది ముర్ము అధ్యక్షత వహించనున్నారు.

Read Also: Off The Record : కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ వైఖరి కోసం బీజేపీ చూస్తోందా?

నేటి (మంగళవారం) నుంచి ఏడాది పొడవునా జరిగే వేడుకల్లో రాజ్యాంగ పీఠిక సామూహిక పఠనం లాంటి కార్యక్రమాలను నగరాలు, గ్రామాలు, పాఠశాలల్లో నిర్వహించబోతున్నట్లు కేంద్ర సంస్కృతిక శాఖ తెలిపింది. నవంబర్‌ 26న జరిగే రాజ్యాంగ దినోత్సవం కేవలం పార్లమెంటులో మాత్రమే జరుపుకునే సెలబ్రేషన్స్ కాదు.. దేశం మొత్తం జరుపుకోవాల్సిన పండుగని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులుగా అందులోని విషయాలను దేశ ప్రజల ముందుకు తీసుకుపోతున్నామన్నారు. నేడు రాజ్యాంగ నిర్మాతలకు నివాళులు అర్పించనున్నట్లు పేర్కొన్నారు.

Show comments