Site icon NTV Telugu

India-Pak: సింధు జలాలపై భారత్ మాస్టర్ ప్లాన్!

Induswaters

Induswaters

పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్ పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. అందులో మొట్టమొదటిగా ఏప్రిల్ 23న పాకిస్థాన్‌కు సింధు జలాలు నిలిపివేసింది. అలాగే వీసాలు రద్దు చేసింది. అటారీ సరిహద్దు నిలిపివేసింది. ఇలా పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. అయితే సింధు జలాలపై పునరాలోచన చేయాలని ఇప్పటికే పాక్ విదేశాంగ శాఖ.. భారత్‌కు లేఖ రాసింది. ఇదిలా ఉంటే ఇటీవల ప్రధాని మోడీ కీలక స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఉగ్రవాదం, పీవోకేపై తప్ప.. ఇంకా ఎలాంటి విషయంలోనూ పాక్‌తో చర్చలుండవని తేల్చి చెప్పారు.

ఇది కూడా చదవండి: Jupally Krishna Rao: తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వేదికకు పరిచయం చేశాం..

అయితే తాజాగా కేంద్రం సింధు జలాలపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల మధ్య సింధు నది నుంచి నీటిని మళ్లించడానికి కాలువలు తవ్వాలని భారతదేశం వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సింధు నదులకు అనుసంధానించబడిన కాలువుల పునర్మిర్మాణం, విస్తరణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. కాలువల విస్తరణతో దాదాపు 60 శాతం నికర-విత్తనాల ప్రాంతానికి నీరందించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో వేసవి రుతుపవనాలపై ఆధారపడటం తగ్గుతుందని భావిస్తోంది. పాకిస్థాన్ పూర్తిగా ఉగ్రవాదాన్ని విరమించుకునే వరకూ సింధు జలాలు ఇచ్చేది లేదని భారత్ భావిస్తోంది.

ఇది కూడా చదవండి: Thug life : కమల్ హాసన్ ’థగ్ లైఫ్’ తెలుగు ట్రైలర్ రిలీజ్..

తాజా పరిణామాల నేపథ్యంలో రణబీర్, న్యూ పార్తాప్, రంజన్, తావి లిఫ్ట్, పరాగ్వాల్, కథువా కెనాల్, రావి కెనాల్‌ల్లో పూడికతీత పనులను ప్రారంభించడానికి భారతదేశం సన్నాహాలు చేస్తోందని నివేదికలు అందుతున్నాయి. ఈ పనిని కేంద్రం మార్గదర్శకత్వంలో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ద్వారా దశలవారీగా పూర్తి చేయాలని చూస్తోంది.

Exit mobile version