Site icon NTV Telugu

Central Government: కేంద్రం కొత్త నిబంధనలు.. ఇకపై పిల్లలకు కూడా హెల్మెట్

ఇప్పటి వరకు ద్విచక్రవాహనాలపై ప్రయాణించే పెద్దలకు మాత్రమే హెల్మెట్ ధరించాలనే నియమం ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వం తాజాగా మరిన్ని నిబంధనలను ప్రకటించింది. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే చిన్నారులకు సైతం హెల్మెట్‌ను తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు చిన్నారులకు కూడా వారి సైజు ప్రకారం హెల్మెట్‌లను తయారు చేయాలని హెల్మెట్ తయారీదారులను ఈ మేరకు ప్రభుత్వం కోరింది.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నిబంధనల ప్రకారం.. ఎవరైనా వీటిని ఉల్లంఘిస్తే రూ.వెయ్యి జరిమానాతో పాటు మూడు నెలల జైలుశిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడతాయని హెచ్చరికలు జారీ చేసింది. సెంట్రల్ మోటార్ వెహికల్స్ నిబంధనలు- 1989కి సవరణ ద్వారా కొత్త నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ నిబంధనలు నాలుగేళ్ల పిల్లల నుంచి వర్తించనున్నాయి. కొత్త నిబంధనల్లో భాగంగా పిల్లలతో సహా ప్రయాణిస్తున్న ఏదైనా ద్విచక్ర వాహనం గంటకు గరిష్టంగా 40 కి.మీ కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించకూడదు.

Exit mobile version