Site icon NTV Telugu

Aadhar Card: ఆధార్ జిరాక్స్ కాపీల ప్రకటనపై మాట మార్చిన కేంద్రం

Aadhar Card

Aadhar Card

ఆధార్ కార్డుల దుర్వినియోగాన్ని నిరోధించడం కోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఓ ప్రకటన జారీ చేసింది. ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలు ఇతరులతో షేర్ చేసుకునే సమయంలో చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించే విధంగా మాస్క్‌డ్ జిరాక్స్ కాపీలు ఉండాలని తెలిపింది. ఈ ప్రకటన దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో విమర్శలు వచ్చాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆధార్ జిరాక్స్ కాపీలపై మాట మార్చింది.

Smart Watches: ఈ స్మార్ట్ వాచ్ లు ట్రై చేశారా?

దేశ పౌరులు ఆధార్ జిరాక్స్ కాపీలను కాకుండా మాస్క్‌డ్ కాపీలను ఇవ్వాలని సూచించామని… అయితే జిరాక్స్ కాపీ ఇచ్చే సమయంలో సాధారణ వివేకాన్ని పాటిస్తే చాలు అని.. ఆధార్ ఐడెంటిటీ అథెంటికేషన్ ఎకో సిస్టమ్ అనేది మీ ఆధార్ కార్డు గోప్యతను రక్షిస్తుందని తాజాగా యూఐడీఏఐ ట్వీట్ చేసింది. తమ ప్రకటనను చాలా మంది తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని.. కావున గతంలో విడుదల చేసిన ప్రకటనను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. కాగా ఆధార్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ప్రజలు పబ్లిక్ కంప్యూటర్లను ఉపయోగించుకోవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇంటర్నెట్ కేఫ్‌లలో కంప్యూటర్ల నుంచి ఆధార్ కార్డులను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్‌లోడ్ చేసుకోవద్దని. ఒకవేళ చేసుకుంటే దుర్వినియోగం అయ్యే అవకాశముందని హెచ్చరించింది.

Exit mobile version