Site icon NTV Telugu

తెలుగు రాష్ట్రాలకు నిరాశ.. రిపబ్లిక్ డే వేడుకల్లో దక్కని చోటు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ అందించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 26న ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో జరిగే వేడుకల్లో తెలుగు రాష్ట్రాల శకటాలకు ఈ ఏడాది స్థానం దక్కలేదు. ఈసారి గణతంత్ర వేడుకలకు మొత్తం 12 రాష్ట్రాలు, 9 శాఖలకు చెందిన శకటాలే రిపబ్లిక్ డే కవాతులో పాలుపంచుకోనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మేఘాలయా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన శకటాలే రిపబ్లిక్ డే వేడుకల్లో కవాతు చేస్తాయని కేంద్ర రక్షణశాఖ తెలిపింది.

Read Also: 3 వారాల్లో గరిష్ట స్థాయికి కరోనా.. తాజా రీసెర్చ్‌ వార్నింగ్

మరోవైపు విద్య-నైపుణ్యాభివృద్ధి, పౌర విమానయానం, న్యాయశాఖ సహా మొత్తం 9 శాఖలకు చెందిన శకటాలు రిపబ్లిక్ డే ప్రదర్శనల్లో పాల్గొననున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన అమృతోత్సవాల థీమ్‌తో కూడిన అంశాలను ఈ శకటాలు ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏడాది రిపబ్లిక్ వేడుకల్లో కవాతు ప్రారంభమయ్యే సమయాన్ని ఉదయం 10 గంటలక బదులు 10:30 గంటలకు మార్చినట్లు అధికారులు వెల్లడించారు. మంచు కమ్మేసే అవకాశం ఉన్నందున ఈ మార్పు చేసినట్లు వివరించారు. ఈ ఏడాది ఫ్లైపాస్ట్‌లో విమానాలు, హెలికాప్టర్లు 15 విభిన్న భంగిమల్లో ఎగిరి కనువిందు చేయనున్నాయి.

Exit mobile version