Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Central Cabinet Greensignal Job Boost Plan With Focus On Youth And Industry

Central Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. రూ. లక్ష కోట్లతో ఆర్‌డీఐ స్కీమ్‌కు గ్రీన్సిగ్నల్

Published Date :July 1, 2025 , 4:53 pm
By Chandra Shekhar Pamena
  • కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. కొత్త క్రీడా విధానానికి కేబినెట్‌ ఆమోదం..
  • ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కోసం రూ.1.07 లక్షల కోట్లు..
  • రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్నోవేషన్‌ స్కీమ్‌ కోసం 1 లక్ష కోట్లు కేటాయింపు..
  • పరమకుడి - రామనాథ పురం నేషనల్‌ హైవే 4 లేన్ల కోసం రూ.1,853 కోట్లు కేటాయింపు..
Central Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. రూ. లక్ష కోట్లతో ఆర్‌డీఐ స్కీమ్‌కు గ్రీన్సిగ్నల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Central Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఉద్యోగాల కల్పన ప్రోత్సాహక పథకంకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇక, కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. అన్ని రంగాల్లో ఉద్యోగాల కల్పన, ఉద్యోగ కల్పనా సామర్థ్యం, సామాజిక భద్రత పెంచేందుకు సరికొత్త పథకం తీసుకొచ్చినట్లు తెలిపారు. ఉత్పాదక రంగానికి ప్రాధాన్యతనిస్తూ కొత్తగా తొలిసారి ఉద్యోగాల్లో చేరే వారికి ప్రోత్సాహకాలు.. మొదటి సారి ఉద్యోగంలోకి వచ్చే వారికి రెండు విడతలుగా రూ.15,000 వరకు ప్రోత్సాహకం అందించనున్నారు. ఉద్యోగంలో చేరిన తొలి 6 నెలలు పూర్తయ్యాక మొదటి కిస్తీ, 12 నెలల పూర్తయిన తర్వాత రెండో కిస్తీ.. వస్తూత్పత్తి రంగంలో అదనపు ఉద్యోగాల కల్పన కోసం, యజమానులకు రెండేళ్ళ పాటు అదనపు ప్రోత్సాహకాలు అందిస్తామని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

Read Also: Fake Student: ఐఐటీ బాంబేలో చొరబాటుదారుడి కేసులో కీలక విషయాలు.. ఉగ్ర కోణంలో విచారణ..

ఇక, రెండు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులతో, దేశంలోని 4 కోట్ల 10 లక్షల మంది యువతకు నైపుణ్యం, ఇతర అవకాశాలు, ఉద్యోగాల కల్పన కోసం 2024-25
కేంద్ర బడ్జెట్ లో ప్రధాని మోడీ ప్యాకేజీతో కూడిన ఐదు పథకాలను ప్రకటించారని కేంద్రమంత్రి వైష్ణవ్ పేర్కొన్నారు. వచ్చే రెండేళ్ళలో మూడున్నర కోట్ల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా కొత్త పథకం తీసుకొచ్చాం. దేశంలో కొత్తగా కల్పించే మూడున్నర కోట్ల ఉద్యోగాల్లో, తొలిసారిగా ఉద్యోగాలు పొందే వారి సంఖ్య ఒక కోటి 92 లక్షల మంది.. రూ.1 లక్షలోపు జీతాలు వచ్చే ఉద్యోగులకు మాత్రమే ఈ పథకం వర్తించనుంది.. ఉద్యోగాలు కల్పించే యజమానులకు 2ఏళ్ళ పాటు ప్రతి నియామకానికి నెలకు రూ.3,000 వరకు ప్రోత్సాహకం అందిస్తామన్నారు. కనీసం 6 నెలల పాటు యజమానులు వారి వారి సంస్థల్లో ఉద్యోగాలను కొనసాగిస్తామన్నారు.

Read Also: Prabhas: ప్రభాస్ కాలికి ‘ఫౌజీ’ షూట్లో గాయం.. అసలేమైందంటే?

అలాగే, వస్తూత్పత్తి రంగంలో మాత్రం యజమానులకు ఈ నగదు ప్రోత్సాహకాన్ని మూడు, నాలుగో ఏడాది వరకు కొనసాగింపు ఉంటుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రావిడెంట్ ఫండ్ సంస్థలో నమోదు చేసుకుని, 50 మంది కంటే తక్కువ ఉద్యోగులున్న సంస్థలు కనీసం ఇద్దరిని, 50 కంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న సంస్థలు ఐదుగురు ఉద్యోగులను అదనంగా నియమించి, కనీసం 6 నెలల పాటు కొనసాగించాలని నిబంధన ఉంది. ఇక, తయారీ రంగంలో నాలుగేళ్ల వరకూ ప్రోత్సాహకాల పొడిగింపు ఉంటుంది. ఉద్యోగుల జీతాల స్థాయిని బట్టి ఉద్యోగదారులకు ప్రోత్సాహకాలు అందిస్తాం.. ఉద్యోగులకు “ఆధార్ అనుసంధాన చెల్లింపు విధానం” ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ చేయాలి.. ఉద్యోగాలు కల్పించే యజమానులకు “పాన్ అనుసంధాన బ్యాంకు అకౌంట్ల”లో నగదు ప్రోత్సాహకాలు జమ చేస్తున్నామని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.

Read Also: CM Chandrababu: రౌడీలతో పోరాటం చేస్తున్నా.. వికాసం.. విధ్వంసం మధ్య యుద్ధం..!

అయితే, పరమక్కుడి – రామనాథపురం (NH-87) 4 లైన్ రహదారి నిర్మాణానికి కేంద్ర మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. మొత్తం వ్యయం రూ.1,853 కోట్లు – 46.7 కిలోమీటర్ల పొడవు ఉంటుంది.. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (HAM) ద్వారా రహదారి అభివృద్ధి.. ప్రధాన నగరాల మధ్య ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం అవుతుంది. మదురై, పరమక్కుడి, రామనాథపురం, మండపం, రామేశ్వరం, ధనుష్కోడి మధ్య మెరుగైన అనుసంధానం కల్గుతుంది. సతిరకుడి, అచున్దన్వాయల్ లాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం.. రహదారి విస్తరణ వల్ల రహదారి భద్రత, వేగం పెరుగుతుంది.. ఐదు జాతీయ రహదారులను, మూడు రాష్ట్ర రహదారులతో అనుసంధానం చేస్తున్నామని వెల్లడించారు. NH-38, NH-85, NH-36, NH-536, NH-32తో అనుసంధాన ప్రాజెక్ట్‌ కొనసాగుతుంది. అలాగే, SH-47, SH-29, SH-34తో అనుసంధానం చేయబడుతుంది. మదురై, రామేశ్వరం రైల్వే స్టేషన్లు – మదురై విమానాశ్రయం – రెండు మైనర్ పోర్టులకు అనుసంధానం చేస్తున్నాం.. ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి పునాది వేస్తున్నాం.. రామేశ్వరం, ధనుష్కోడి టూరిజానికి ప్రోత్సాహం.. వాణిజ్యం, పరిశ్రమల అభివృద్ధికి అవకాశాలు.. ముడి వస్తువులు, ప్రయాణికులు వేగవంతమైన రవాణాకు అనుకూలం.. ఉద్యోగ సృష్టిలో భారీ అవకాశం.. 8.4 లక్షల ప్రత్యక్ష, 10.45 లక్షల పరోక్ష ఉపాధి దినాలు.. ప్రాంతీయ అభివృద్ధికి దారితీసే ప్రాజెక్ట్ అని అశ్విని వైష్ణవ్ చెప్పుకొచ్చారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ashwini Vaishnaw
  • bjp
  • Central Cabinet
  • Employment incentive scheme
  • Government Job

తాజావార్తలు

  • LPG Shortage: ఇక, LPG కొరతకు చెక్..! చిన్న సిలిండర్ల సరఫరా పెంచిన సర్కార్..

  • Amitabh Bachchan: సోమరితనంపై అమితాబ్ బచ్చన్ సెన్సేషనల్ కామెంట్స్!

  • KKR vs PBKS: నేడు హ్యాట్రిక్ కోసం కోల్‌కతా-పంజాబ్ పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులు ఇవే

  • Stock Market: ట్రంప్ బెదిరింపులు.. నష్టాల్లో కొనసాగుతోన్న సూచీలు

  • JanhviKapoor: అశ్లీల వెబ్‌సైట్‌లో నా ఫోటో.. జాన్వీ కపూర్ ఎమోషనల్ కామెంట్స్!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions