Site icon NTV Telugu

Central Cabinet Decisions: బీహార్ ఎన్నికల వేళ అన్నదాతలకు కేంద్రం శుభవార్త

Modi

Modi

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. బీహార్ ఎన్నికల వేళ అన్నదాతల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఫర్టిలైజర్ సబ్సిడీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.రూ.3,000 కోట్ల రూపాయల సబ్సిడీకి కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

మంగళవారం ఉదయం ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశం అయింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను మధ్యాహ్నం 3 గంటలకు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించనున్నారు.

కేబినెట్ నిర్ణయాలు ఇవే..
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు చర్యలు
నవంబర్ 1 నుంచి పాత కమర్షియల్ వెహికల్స్‌కు నో ఎంట్రీ
బీఎస్ 6 ఇంజన్లు లేని వాహనాలకు కూడా అనుమతి నిరాకరణ
ఢిల్లీలో రోజురోజుకు కాలుష్యం పెరిగిపోతున్న నేపద్యంలో పాత కమర్షియల్ వాహనాలకు బ్రేక్ వేసింది.

రైతులకు కేంద్ర కేబినెట్ శుభవార్త
ఫర్టిలైజర్ సబ్సిడీకి కేంద్ర కేబినెట్ ఆమోదం
రూ.3,000 కోట్ల రూపాయల సబ్సిడీకి అనుమతి

ఇది కూడా చదవండి: Bus Accident: మరో బస్సు ప్రమాదం.. హైటెన్షన్ వైర్‌ తగిలి బస్సు దగ్ధం

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతలుగా జరగనున్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. ప్రధానంగా ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి మధ్య పోటీ నెలకొంది.

Exit mobile version