ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొనడంతో ఆర్బీఐ మాదిరిగానే వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకులు బంగారం నిల్వలు క్రమంగా పెంచుకునే పనిలో పడిపోయాయి.. డాలర్‌పై రూపాయికి మద్దతుగా ఆర్బీఐ.. ఆయా దేశాలు తమ కరెన్సీకి సపోర్టివ్‌గా బంగారం కొనుగోలు చేశాయి. గత జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కేంద్రీయ బ్యాంకులు 399.3 టన్నుల బంగారం కొనేశాయి.. అయితే 2021 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కేవలం 90.6 టన్నుల బంగారం మాత్రమే కొనుగోలు చేశాయి కేంద్రీయ బ్యాంకులు. ఇక, ఇందులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) టాప్‌లో నిలుస్తుంది. దీనికి తోడు ప్రస్తుతం దేశంలో వివాహాల సీజన్ సాగుతోంది. దీంతో మున్ముందు బంగారం ధరలు పైపైకి దూసుకెళ్తాయని బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read Also: Justice Chandrachud: భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణం
అయితే, దశాబ్ధి కాలానికి పైగా ఒక త్రైమాసికంలో కేంద్రీయ బ్యాంకులు బంగారం ఈ స్థాయిలో కొనుగోలు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.. ఇక, డబ్ల్యూజీసీ డిమాండ్ ట్రెండ్స్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది తొలి 9 నెలల్లో వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకుల నుంచి 673 టన్నులకు బంగారం డిమాండ్ పెరిగింది. ఇది 2018లో కొనుగోలు చేసిన 656.6 టన్నుల బంగారం కంటే 2.5 రెట్లు అధికం.. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో బంగారం కొనుగోళ్లు జరిపిన సెంట్రల్ బ్యాంకుల లిస్ట్‌లో ఆర్బీఐ టాప్ స్పాట్‌లో నిలిచింది.. ప్రస్తుత ఆర్థిక అనిశ్చిత సమయంలో బంగారం ఫారెక్స్ రిజర్వులు 17.5 టన్నులు పెంచుకుంది.. మొత్తంగా బంగారం కొనుగోళ్లు చేసిన కేంద్రీయ బ్యాంకుల్లో ఆర్బీఐకి మూడో స్థానంలో ఉంది.. అయితే, కేంద్రీయ బ్యాంకులు బంగారం కొనుగోళ్లు పెంచడం పాజిటివ్ సంకేతం అని కేడియా అడ్వైజరీ డైరెక్టర్ అజయ్ కెడియా అభిప్రాయపడ్డారు..