Big News : రేపటి నుంచి దేశవ్యాప్తంగా పెరగనున్న సిమెంట్‌ ధరలు

  • దేశవ్యాప్తంగా రేపటి నుంచి పెరగనున్న సిమెంట్‌ ధరలు
  • బస్తాకు రూ.30 నుంచి 50 వరకు పెరుగుతుందని డీలర్లకు సమాచారం
  • . ఇవాళ బుకింగ్స్‌ నిలిపివేసిన సిమెంట్‌ కంపెనీలు
  • పాత ధరలపై నిన్నటి వరకే బుకింగ్‌లు
Cement

Cement

సొంతింటి కల నిజం చేసుకోవాలనుకునే వారికి చేదు వార్త. దేశవ్యాప్తంగా సిమెంట్ ధరలు రేపటి నుంచి భారీగా పెరగనున్నాయి. సిమెంట్ కంపెనీలు బస్తాపై గణనీయమైన ధరలను పెంచుతున్నట్లు ఇప్పటికే డీలర్లకు సమాచారం అందించాయి. ఈ పెరిగిన ధరలు తక్షణమే అమలులోకి రానున్నాయి. తాజా సమాచారం ప్రకారం, సిమెంట్ బస్తా (50 కేజీలు) ధరపై రూ. 30 నుంచి రూ. 50 వరకు పెరగనుంది. దీంతో ప్రముఖ కంపెనీల సిమెంట్ బస్తా ధర మార్కెట్లో సుమారు రూ. 360కి చేరనుంది. రవాణా ఖర్చులు పెరగడం, ముడి సరుకుల ధరల పెంపు వంటి కారణాల వల్ల కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Explosion in Police Station: పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. ఎస్సై సహా ముగ్గురికి తీవ్రగాయాలు.!

ధరల పెంపు నేపథ్యంలో సిమెంట్ కంపెనీలు ఇవాళ (మార్చి 31) కొత్త బుకింగ్‌లను పూర్తిగా నిలిపివేసాయి. పాత ధరలపై నిన్నటి (మార్చి 30) వరకు మాత్రమే ఆర్డర్లు తీసుకున్నాయి. ఇవాళ ఎవరైనా సిమెంట్ కొనుగోలు చేయాలన్నా లేదా బుక్ చేయాలన్నా కంపెనీలు నిరాకరిస్తున్నాయి. రేపటి నుంచి పెరిగిన కొత్త ధరలతోనే బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. కేవలం సిమెంట్ ధరలే కాకుండా, ఇటీవల ఇటుకలు, ఇసుక , కూలీల రేట్లు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు సిమెంట్ ధర కూడా బస్తాకు రూ. 50 వరకు పెరగడం వల్ల ఒక సాధారణ ఇంటి నిర్మాణ వ్యయం వేలల్లో పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన వారు , కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకునే వారు ఈ అదనపు భారాన్ని మోయాల్సి వస్తుంది.

Leander Paes: బెంగాల్ ఎన్నికల వేళ కీలక పరిణామం.. బీజేపీలో చేరిన లియాండర్ పేస్