Site icon NTV Telugu

Boycott Turkey: తమది తుర్కియే సంస్థే కాదు.. సెలెబీ ప్రకటన

Celebi

Celebi

ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో దాయాది దేశానికి ఆయుధాలు సరఫరా చేసిన తుర్కియేపై భారతీయులు నిరసన కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఆ దేశానికి సంబంధించిన వస్తువులు, సేవలను, టూరిజాన్ని నిషేధించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇక భారతీయ విమానాశ్రయాల్లో సరకుల రవాణాతో పాటు వివిధ సేవలు అందిస్తున్న తుర్కియే కంపెనీ సెలెబీ ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ ఇండియా లిమిటెడ్‌‌కు అనుమతులను గురువారం కేంద్రం రద్దు చేసింది. పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవ్వడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇది కూడా చదవండి: P.G. Vinda: మరోసారి తెలుగు సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పి.జి. విందా

తాజాగా ఇదే అంశంపై సెలెబీ కంపెనీ స్పందించింది. తమది అసలు తుర్కియే సంస్థే కాదని వెల్లడించింది. ఆ దేశాధ్యక్షుడు ఎర్డోగాన్‌ కుటుంబంతో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. ఎర్డోగాన్‌ కుమార్తె తమ బాస్‌ కాదని సెలెబీ సంస్థ వివరణ ఇచ్చింది.

ఇది కూడా చదవండి: Jaishankar: చరిత్రలో తొలిసారి.. భారత విదేశాంగ మంత్రితో తాలిబాన్ మంత్రి సంభాషణ..!

గురువారం ముంబై ఎయిర్‌పోర్టులో శివసేన ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. 10 రోజుల్లో సెలెబీ సంస్థతో సంబంధం తెంచుకోవాలని అల్టిమేటం విధించారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇలా దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవ్వడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

Exit mobile version