Site icon NTV Telugu

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ నష్టాలపై తొలిసారి స్పందించిన సీడీఎస్.. ఏం చెప్పారంటే..

Cds

Cds

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ సమయంలో నష్టాల గురించి తొలిసారిగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) అనిల్ చౌహాన్ స్పందించారు. నాలుగు రోజులు సంఘర్షణ అణుయుద్ధం స్థాయికి చేరుకోలేని ఆయన చెప్పారు. భారత ఫైటర్ జెట్స్ కూలిపోయాయనే ఊహాగానాల నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ విషయం ఏంటంటే, జెట్ కూలిపోవడం కాదు, కానీ అవి ఎందుకు కూలిపోతున్నాయనేదే ముఖ్యం’’ అని ఆయన శనివారం సింగపూర్‌లో జరిగిన షాంగ్రి-లా డైలాగ్‌లో పాల్గొన్నప్పుడు బ్లూమ్‌బెర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. పాకిస్తాన్ ఆరు భారత యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు పాకిస్తాన్ పేర్కొన్న వాదనలను పూర్తిగా తప్పు అని ఆయన చెప్పారు. అయితే, భారత్ ఎన్ని జెట్స్ కూలిపోయాయనే దానిపై మాట్లాడటానికి నిరాకరించారు. ‘‘అవి ఎందుకు కూలిపోయాయి, ఏ తప్పులు జరిగాయి, అవి ముఖ్యమైనవి, సంఖ్య ముఖ్యం కాదు’’ అని అన్నారు.

Read Also: MLC Kavitha: దూకుడు పెంచిన కవిత.. తెలంగాణ జాగృతి నూతన కార్యాలయం ఓపెనింగ్..

ఇందులో మంచి విషయం ఏంటంటే, మనం చేసిన వ్యూహాత్మక తప్పిదాలను అర్థం చేసుకోగలుతున్నాము, సరిదిద్దుకోగలుగుతున్నాము. రెండు రోజుల తర్వాత దాన్ని సరిగ్గా అమలు చేయగలము. లాంగ్ రేంజ్ లక్ష్యంగా చేసుకుని మా అన్ని జెట్స్ ని మళ్లీ ఎగరవేయగలము’’ అని చౌహాన్ అన్నారు. ఈ నెల ప్రారంభంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్ కి చెందిన ఆరు జెట్స్‌ని కూల్చేశామని పేర్కొన్నారు. అయితే, భారత ప్రభుత్వం దీనిపై వ్యాఖ్యానించడానికి దూరంగా ఉంది.

అణు యుద్ధాన్ని నివారించడదానికి అమెరికా సహాయం చేసిందని డొనాల్డ్ ట్రంప్ చేసిన వాదనలపై అనిల్ చౌహాన్ వ్యాఖ్యానించలేదు. పాక్ మోహరించిన చైనా ఆయుధాలు భారత్ ముందు పనిచేయలేదని చెప్పారు. 300 కి.మీ దూరంలోని పాకిస్తాన్ వైమానిక స్థావరాన్ని అత్యంత ఖచ్చితత్వంతో కొట్టామని ఆయన వెల్లడించారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు పాకిస్తాన్ భారత్ కన్నా అన్ని విషయాల్లో ముందున్నప్పటికీ, ఇప్పుడు అన్ని విషయాల్లో చాలా వెనకబడి ఉందని సీడీఎస్ చెప్పారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో స్వదేశీ తయారీ ఆకాష్ క్షిపణి వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా పనిచేసిందని ఆయన చెప్పారు.

Exit mobile version