Delhi Car Blast: సీసీటీవీలో రికార్డైన ఢిల్లీ బ్లాస్ట్ దృశ్యాలు.. సోషల్ మీడియాలో వైరల్
- సీసీటీవీలో రికార్డైన ఢిల్లీ బ్లాస్ట్ దృశ్యాలు
- సోషల్ మీడియాలో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ బాంబ్ పేలుడు యావత్తు దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. ప్రశాంతంగా ఉన్న దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎర్రకోట ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారు బ్లాస్ట్ అయింది. పెద్ద ఎత్తున విస్ఫోటనం జరగడంతో ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియక ప్రజలు అయోమయానికి గురయ్యారు. అక్కడికక్కడే కొందరు ప్రాణాలు కోల్పోగా.. ఇంకొందరు గాయపడ్డారు. మరికొందరు ప్రాణభయంతో పరుగులు తీశారు.
ఇది కూడా చదవండి: Shaheen: ప్రొఫెసర్ నుంచి ఉగ్రవాదిగా ఎలా మారింది? డాక్టర్ షాహీన్ బ్యాగ్రౌండ్ ఇదే!
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్‌కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
తాజాగా బాంబ్ బ్లాస్ట్‌కు సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సోమవారం (10-11-2025) సాయంత్రం 6:50 గంటల ప్రాంతంలో ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్-1 సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ ఉంది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇందులో హ్యుందాయ్ ఐ20 కారు ఒక్కసారిగా పేలిపోయింది. అధిక తీవ్రతతో కూడిన పేలుడు సంభవించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డైంది. సీసీటీవీ ఫుటేజ్ ఈరోజు వెలుగులోకి వచ్చింది. ఇక ఈ పేలుడులో ఇప్పటి వరకు 12 మంది చనిపోగా.. పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం దర్యాప్తు సంస్థలు తీవ్రంగా విచారణ జరుపుతున్నారు.
ఇది కూడా చదవండి: Dubai: దుబాయ్ ఎడారిలో రష్యన్ క్రిప్టో వ్యాపారవేత్త దంపతులు హత్య.. అసలేం జరిగిందంటే..!
ఇదిలా ఉంటే ఫరీదాబాద్‌లో అరెస్టైన డాక్టర్ ముజమ్మిల్ నుంచి కీలక విషయాలను రాబట్టాయి. ఎర్రకోట దగ్గర జరిగిన దాడి దీపావళి నాడు ప్లాన్ చేసినట్లుగా వర్గాలు పేర్కొన్నాయి. దీపావళి నాడు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో దాడి చేయాలని ప్లాన్ చేశామని.. అనంతరం ఆ ప్లాన్ రద్దు చేసుకున్నట్లుగా ముజమ్మిల్ దర్యాప్తు అధికారులకు చెప్పినట్లుగా సమాచారం. ఇక ఈ ప్లాన్‌ను జనవరి 26, 2026న అమలు చేయాలని ప్రణాళిక వేసుకున్నామని.. ఇందులో భాగంగానే ఎర్రకోట చుట్టు పక్కల ప్రాంతాలను గుర్తించినట్లుగా ముజమ్మిల్ పోలీసులకు తెలియజేసినట్లుగా వర్గాలు పేర్కొన్నాయి.
VIDEO | CCTV footage captures the exact moment of the blast near Delhi's Red Fort.
A blast took place in a slow-moving car at a traffic signal near the Red Fort metro station on Monday evening, killing 12 people, injuring many and gutting several vehicles.
(Source: Third Party)… pic.twitter.com/xjpScNpJ5Y
— Press Trust of India (@PTI_News) November 12, 2025
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!