NTV Telugu Site icon

CBSE Class 10 Results: సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల.. 93.12 శాతం ఉత్తీర్ణత

Cbse Results

Cbse Results

CBSE Class 10 Results: సీబీఎస్ఈ ఇంటర్మీడియల్ ఫలితాలు ప్రకటించిన కొద్ది సేపటికే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) గురువారం 10వ తరగతి ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది 93.12 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాదితో పోలిస్తే 1.28 శాతం ఉత్తీర్ణత తగ్గింది. ఈ ఏడాది ఫిబ్రవరి 15 మరియు మార్చి 21 మధ్య ఈ పరీక్షలు జరిగాయి. 12వ తరగతి మాదిరిగానే, CBSE 10వ తరగతి విద్యార్థులకు మెరిట్ జాబితాను విడుదల చేయదు. అయితే, సబ్జెక్టుల్లో అత్యధిక మార్కులు సాధించిన 0.1 శాతం మంది విద్యార్థులకు మెరిట్ సర్టిఫికేట్ జారీ చేస్తుంది. ఈ ఏడాది 19 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. CBSE వెబ్‌సైట్ – cbseresults.nic.in మరియు cbse.gov.inలో రిజర్ట్స్ పొందవచ్చు. ఈ లింకులపై క్లిక్ చేసి విద్యార్థులు ఫలితాలు పొందవచ్చు.

ఇలా రిజల్ట్స్ తెలుసుకోండి..

*విద్యార్థులు అధికార వెబ్‌సైట్‌లలో ఏదైనా ఒకదానికి లాగిన్ అవ్వాలి.
*రోల్ నెంబర్, అడ్మిట్ కార్డ్ ఐడీ, పాఠశాల నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాలి.
*సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత రిజల్ట్స్ తెలుసుకోవచ్చు
*రిజల్ట్స్ ను విద్యార్థులు డౌన్ లోన్ చేసుకోవచ్చు.
*CBSE బోర్డ్ 2023 ఫలితాలు DigiLockerలో కూడా అందుబాటులో ఉంటాయి.
*ప్రభుత్వ సర్వీసులో ఖాతా ఉన్నవారు ఫలితాలను పొందడానికి దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి.
*10వ తరగతి ఫలితాలు ఉమంగ్ యాప్‌లో కూడా అందుబాటులో ఉంటాయి. ఫలితాలను పొందడానికి విద్యార్థులు వారి రోల్ నంబర్లు, అడ్మిట్ కార్డ్ ID, పాఠశాల నంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేయాలి.

రిజల్ట్స్ లింక్స్ ఇవే:
cbseresults.nic.in,
cbse.gov.in

 

Show comments