Mohalla Clinics: కేజ్రీవాల్‌కి కొత్త చిక్కు.. ఆప్ “మొహల్లా క్లినిక్‌ల”పై సీబీఐ విచారణకి ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohalla Clinics: ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసులో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి కొత్త చిక్కు ఎదురైంది. ఆప్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న మొహల్లా క్లినిక్‌ల పనితీరులో అవినీతి జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఆమ్ ఆద్మీ మొహల్లా క్లినిక్‌లలో జరిగి రోగనిర్ధారణ పరీక్షల్లో అవినీతి జరిగిందని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేయాల్సిందిగా సీబీఐని కేంద్రం కోరినట్లు సంబంధింత వర్గాలు తెలిపాయి.
Read Also: Auto Drivers Begging: ఫ్రీ సర్వీసులతో ఉపాధి కోల్పోయాం.. బస్సుల్లో ఆటో డ్రైవర్ల భిక్షాటన
Also Read
- Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
- PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
- Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. "డీలిమిటేషన్ బిల్లు" పై ఫోకస్..
- Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
మొహల్లా క్లినిక్ పేరుతో ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక హెల్త్ ప్రోగ్రాం చేపట్టింది. అయితే ఈ ఆస్పత్రుల్లో ఎలాంటి పేషెంట్లు లేకుండానే నకిలీ రేడియాలజీ, పాథాలజీ పరీక్షలు నిర్వహించాయనే ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీ ఆరోగ్యమంత్రి సౌరభ్ భరద్వాజ్ కూడా సెప్టెంబర్ 20న ఈ విషయాన్ని ప్రస్తావించారు. మొహల్లా క్లినిక్స్‌లో పనిచేస్తున్న ఏడుగురు వైద్యుల్ని తొలగించారు. కొంతమంది ఆస్పత్రులకు రాకున్నా హాజరు అవుతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాసిరకం మందులు సరఫరా అవుతున్నాయని కొద్ది రోజుల క్రితం ఎల్జీ వీకే సక్సేనా సీబీఐ చేత విచారించాలని ఆదేశించారు. మొహల్లా క్లినిక్ కేసులో, క్లినిక్‌లకు రాని వైద్యులు ఉన్నారని గుర్తించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. క్లినిక్‌లు లేని రోగులకు రోగనిర్ధారణ పరీక్షలను సూచిస్తూనే ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆమ్ ఆద్మీ మొహల్లా క్లినిక్ పేరుతో ఇంటి వద్దే ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అందించేందుకు ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం ఇది అవినీతి ఆరోపణల్ని ఎదుర్కొంటోంది.
తాజావార్తలు
-
Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్‌కు కీలక సమాచారం!
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
-
PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
-
Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. “డీలిమిటేషన్ బిల్లు” పై ఫోకస్..
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!