నరేంద్ర గిరి మృతి కేసు.. రంగంలోకి సీబీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అఖిల భారతీయ అఖారా పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి మృతి కేసులో రంగంలోకి దిగింది సీబీఐ.. నరేంద్ర గిరి అనుమానాస్పద మరణంపై విచారణను సీబీఐకి అప్పగిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే కాగా.. ఇక, యూపీ సర్కార్ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో.. రంగంలోకి దిగింది కేంద్ర దర్యాప్తు సంస్థ.. యూపీ పోలీసుల నుంచి కేసును సీబీఐ స్వాధీనం చేసుకుంది.. ఎఫ్ఐఆర్‌ను నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు.
కాగా, సోమవారం అలహాబాద్‌లోని బాఘంబరి మఠంలో మహంత్ నరేంద్ర గిరి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది.. మఠం అతిథి గృహంలో ఆయన పైకప్పునకు వేలాడుతూ కనిపించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు గదిని పరిశీలించగా 8 పేజీల లేఖ ఒకటి లభించింది. తొలుత ఆయన మృతిని పోలీసులు ఆత్మహత్యగా భావించినా… సూసైడ్ నోట్‌లోని అంశాలను పూర్తిగా పరిశీలించిన అనంతరం శిష్యులను విచారించడంతో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.. ఇక, 18 మంది సభ్యులతో ‘సిట్’ ఏర్పాటు చేసిన యూసీ సర్కార్.. మహంత్ శిష్యుడిని అదుపులోకి తీసుకున్నారు.. మరోవైపు.. తాను మానసికంగా దెబ్బతిన్నానని, ఇందుకు తన శిష్యులలో ఒకరు బాధ్యలని మహంత్ తన సూసైడ్ నోట్‌లో పేర్కొనడంతో.. సీబీఐ దర్యాప్తు డిమాండ్ తెరపైకి రావడం.. యూపీ సర్కార్ నిర్ణయం తీసుకోవడం.. దానికి కేంద్రం కూడా ఆమోదం తెలపడంతో.. ఇక, తన పనిని ప్రారంభించింది సీబీఐ.
Also Read
- Kesar Mango Record: పండ్ల రాజు గిర్ కేసర్ మామిడి.. 10 ఏళ్ల రికార్డులు బద్దలు
- Uddhav Thackeray: అధికారం కోసం కాదు, సిద్ధాంతాల కోసమే పదవిని వదులుకున్నా: ఉద్ధవ్ ఠాక్రే
- MK Stalin: రాహుల్‌గాంధీకి వెరైటీగా బర్త్‌డే విషెస్ చెప్పిన స్టాలిన్
- Rahul Gandhi: ఖర్గే ఆధ్వర్యంలో బర్త్‌డే కేక్ కట్ చేసిన రాహుల్ గాంధీ.. అభిమానులతో ఫొటోలు
తాజావార్తలు
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
-
Kesar Mango Record: పండ్ల రాజు గిర్ కేసర్ మామిడి.. 10 ఏళ్ల రికార్డులు బద్దలు
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లో క్లీన్.!
-
Parastoo Ahmadi: హిజాబ్ ధరించనందుకు గాయనికి 74 కొరడా దెబ్బలతో శిక్ష
ట్రెండింగ్
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్‌కు భారీ షాక్.. ప్రపంచ కప్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు