NTV Telugu Site icon

RG Kar verdict: ఆర్‌జీ కర్ కేసులో ఉరిశిక్ష విధించాలన్న బెంగాల్ ప్రభుత్వ విజ్ఞప్తిని వ్యతిరేకించిన సీబీఐ

Cbi

Cbi

RG Kar verdict: ఆర్జీ కర్‌ హస్పటల్ లో జూనియర్ డాక్టర్ హత్య, అత్యాచారం కేసులో నిందితుడు సంజయ్‌రాయ్‌కు మరణశిక్ష విధించాలని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం కోల్ కతా హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన సీబీఐ బెంగాల్‌ సర్కార్ ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ దాఖలు చేయడాన్ని సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ కేసును విచారించిన ఏజెన్సీగా శిక్ష విషయంలో కోర్టును ఆశ్రయించే హక్కు తమకు మాత్రమే ఉంటుందని తేల్చి చెప్పింది. ఇందులో జోక్యం చేసుకొనే అధికారం ప్రభుత్వానికి లేదని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పేర్కొంది.

Read Also: Karnataka CM Post: కర్ణాటక ముఖ్యమంత్రి కావాలనే కోరిక డీకే శివకుమార్కు ఉంది..

అయితే, ఈ కేసులో నిందితుడికి సీల్దా కోర్టు విధించిన శిక్ష సరిపోదని బెంగాల్ ప్రభుత్వ కోల్‌కతా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించిన న్యాయస్థానం.. అందరి వాదనలు విన్న తర్వాతే సర్కార్ దాఖలు చేసిన అప్పీల్‌ను పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించింది. నిందితుడు సంజయ్‌ రాయ్‌తో పాటు సీబీఐ, మృతురాలి కుటుంబ సభ్యుల వాదనలు మరోసారి వింటామని చెప్పుకొచ్చింది. వచ్చే సోమవారం ( జనవరి 27) ఈ కేసుపై విచారణను జరుపుతామని తెలిపింది.

Read Also: Molly Wood : ఏడాదిగా ఆ హీరోతో దోబుచూలాడుతోన్న హిట్టు

కాగా, గత ఏడాది ఆగస్టు 9న ఆర్జీ కర్‌ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన కేసుపై ఇటీవల విచారణ చేసిన కోల్‌కతాలోని సీల్దా న్యాయస్థానం నిందితుడికి జీవిత ఖైదు విధించింది. అలాగే, బాధిత కుటుంబానికి రూ.17 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని బెంగాల్ సర్కార్ కి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఉరి శిక్ష విధించడానికి అరుదైన కేసు కేటగిరీలోకి రాదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. దీనిపై పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ.. ఈ తీర్పుపై అసంతృప్తిగా ఉందన్నారు. దోషికి మరణశిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు.