Vijay: ఎన్నికల ముందు విజయ్‌కు షాక్.. కరూర్ ఘటనలో సీబీఐ నోటీసులు

  • ఎన్నికల ముందు విజయ్‌కు షాక్
  • కరూర్ ఘటనలో సీబీఐ నోటీసులు
  • జనవరి 12న హాజరుకావాలని నోటీసులు
Vijay

Vijay

టీవీకే చీఫ్, నటుడు విజయ్‌కు సీబీఐ నోటీసులు ఇచ్చింది. జనవరి 12న హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. కరూర్ తొక్కిసలాట ఘటనలో నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ సీబీఐ ప్రధాన కార్యాలయంలో విజయ్‌ను విచారించే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: US-Pakistan: ఆపరేషన్ సిందూర్ ఆపేందుకు అమెరికాలో పాక్ లాబీయింగ్.. వెలుగులోకి..!

తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ర్యాలీలో భాగంగా సెప్టెంబర్ 27, 2025లో కరూర్‌లో బహిరంగ సభ జరిగింది. పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా రాజకీయ సంచలనం సృష్టించింది. అనంతరం బాధిత కుటుంబాలకు విజయ్ ఆర్థిక సాయం అందించారు. ఇక కరూర్ తొక్కిసలాట తర్వాత విజయ్ సభలపై తీవ్రమైన ఆంక్షలు విధిస్తున్నారు