Site icon NTV Telugu

Supreme Court : యూఏఈలో భార్యను హత్య చేసి.. 12 ఏళ్ల తర్వాత…!

Supreme Court

Supreme Court

Supreme Court : యూఏఈలో భార్యను హత్య చేసి గత 12 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడిని సీబీఐ అధికారులు హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు.. సత్తార్‌ ఖాన్‌ ( 52), వృత్తి రీత్యా డ్రైవర్‌ గా పని చేస్తున్నాడు. 2013 నవంబర్‌ 14న యూఏఈలో పనిచేస్తూ తన భార్యను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. హత్య అనంతరం అతను ఇండియా కి పారిపోయి వచ్చి దాదాపు 12 ఏళ్లుగా జాడ తెలియకుండా జాగ్రత్తపడ్డాడు.. యూఏఈ అధికారుల విజ్ఞప్తి మేరకు సీబీఐ 2022 ఏప్రిల్‌లో కేసు నమోదు చేసింది. కేసు నమోదు అయిన తర్వాత సీబీఐ నిందితుడిపై లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ (LOC) జారీ చేసినప్పటికీ, అతను పోలీసులకు చిక్కలేదు.. తరువాత సత్తార్ మరో పాస్‌పోర్ట్‌ ఉపయోగిస్తున్నట్టు తెలిసి, దానిపై మరో లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ జారీ చేశారు.

Pawan Kalyan: విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌పై పవన్‌ కల్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

సాంకేతిక ఆధారాలు, గూఢచార సమాచారం ఆధారంగా సీబీఐ అధికారులు రంగారెడ్డి జిల్లాలో అతని జాడను కనుగొన్నారు. ఈ సమాచారం తెలిసిన సత్తార్‌ ఖాన్‌ దోహా పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా, హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీబీఐ బృందం అతన్ని అదుపులోకి తీసుకుంది. నిందితుడిని హైదరాబాద్‌లోని మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచగా, ఢిల్లీ న్యాయస్థానం ముందు హాజరు పరచడానికి ట్రాన్సిట్‌ రిమాండ్‌ మంజూరు చేశారు. సీబీఐ అధికారులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

Maganti Sunitha Gopinath : మాగంటి సునీత గోపినాథ్ కు బీఆర్ఎస్ బీ-ఫామ్.. రేపే నామినేషన్

Exit mobile version