NTV Telugu Site icon

NEET-UG paper leak: నీట్-యూజీ పేపర్ లీకులో మరో సూత్రధారి అరెస్ట్..

Neet

Neet

NEET-UG paper leak: నీట్, యూజీసీ నెట్ పేపర్ లీక్స్ దేశాన్ని కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ని ప్రక్షాళన చేసేందుకు కేంద్రం కమిటీని నియమించింది. మరోవైపు ఈ కేసులో విచారణ వేగంగా జరుగుతోంది. తాజాగా మెడికల్ ఎంట్రెన్స్ పరీక్ష ‘‘నీట్-యూజీ’’ ప్రశ్నాపత్నం లీకేజీ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన మరో సూత్రధారిని సీబీఐ గురువారం బీహార్‌లో అరెస్ట్ చేసింది.

Read Also: OLA: మహిళతో ఓలా ఆటో డ్రైవర్ దురుసు ప్రవర్తన..ఎక్స్ ఖాతాలో పంచుకున్న బాధితురాలు

ఇతని అరెస్ట్ తర్వాత దర్యాప్తు సంస్థ పాట్నా, కోల్‌కతాలో అతనికి సంబంధించిన వివిధ ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో కీలక ఆధారాలను సీబీఐ స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. నిందితుడిని 10 రోజుల సీబీఐ కస్టడీకి స్థానిక కోర్టు అప్పగించింది.

తెలిసిన వివరాల ప్రకారం.. రాకేష్ రంజన్ అలియాస్ రాకీ జార్ఖండ్‌లోని రాంచీలో ఓ హోటల్ నడుపుతున్నాడు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిన తర్వాత దానిని చింటూ అనే వ్యక్తికి రాకీనే పంపాడు. అతను విద్యార్థులకు సమాధానాలు కలిగిన పేపర్లను మరింత సర్క్యులేట్ చేశాడు. ప్రశ్నా పత్నం లీక్ అయిన తర్వాత ప్రశ్నాపత్నాన్ని సాల్వ్ చేసేందుకు కొందరిని ఏర్పాటు చేశాడు. పాట్నా, రాంచీలకు చెందిన పలువురు ఎంబీబీఎస్ విద్యార్థులను రాకీ, ప్రశ్నలను సాల్వ్ చేసేందుకు నియమించుకున్నాడు.