Site icon NTV Telugu

Cabinet Decisions: జనాభా లెక్కలతో పాటే ‘‘కులగణన’’.. కేంద్రం సంచలన నిర్ణయం..

Central Cabinet Decisions

Central Cabinet Decisions

Cabinet decisions: కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. రాబోయే జనాభా లెక్కల్లో కులగణన చేస్తామని ప్రకటించింది. బుధవారం కేంద్రం క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. జనాభా లెక్కలతో పాటు కుల గణనను చేర్చాలని రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ నిర్ణయించినట్లు వెల్లడించారు.

Read Also: Revanth Reddy: సీఎం ఆన్ ఫైర్.. అన్ని వసతులు అనుభవిస్తూ.. ప్రతిపక్ష పాత్ర పోషించకపోతే ఎలా?

కొన్ని రాష్ట్రాలు రాజకీయ సాధనంగా ‘‘కులగణన ’’ నిర్వహించాయని, ఈ నేపథ్యంలో రానున్న జనాభా లెక్కలతో పాటే కుల గణన చేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించిందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ముందు నుంచి కాంగ్రెస్ సహా ఇతర ఇండీ కూటమి నేతలు, రాజకీయ పార్టీలు కుల గణన నిర్వహించాలని కోరుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే కుల గణన చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పాలిత తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు ఎన్డీయే పాలిత బీహార్‌ కులగణన నిర్వహించాయి.

జాతీయ జనాభా లెక్కలతో కుల గణనను చేర్చడంపై కేంద్ర మంత్రి అశివిని వైష్ణవ్ మాట్లాడుతూ, “కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎల్లప్పుడూ కుల గణనను వ్యతిరేకించాయి. 2010లో, దివంగత డాక్టర్ మన్మోహన్ సింగ్ క్యాబినెట్‌లో కుల గణన అంశాన్ని పరిగణించాలని అన్నారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి మంత్రుల బృందం ఏర్పడింది. చాలా రాజకీయ పార్టీలు కుల గణనను సిఫార్సు చేశాయి.’’ అని అన్నారు.

Read Also: CRPF: సీఆర్పీఎఫ్ ఆపరేషన్ విజయవంతం.. కర్రెగుట్టలపై బేస్ క్యాంప్ ఏర్పాటు..!

కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు ఇండి కూటమి పార్టీలు కులగణను రాజకీయ సాధనంగా ఉపయోగించుకున్నాయని కేంద్రమంత్రి ఆరోపించారు. కొన్ని రాష్ట్రాలు కులాల గణనను బాగానే చేశాయని, మరొకొన్ని రాష్ట్రాలు మాత్రం పారదర్శకంగా లేని విధంగా రాజకీయ కోణం నుంచి మాత్రమే సర్వేలు నిర్వహించాయని అశ్విని వైష్ణవ్ ఆరోపించారు. ఇలాంటి సర్వేల వల్ల సమాజంలో సందేహాలు సృష్టించారని అన్నారు. మన సామాజిక నిర్మాణం రాజకీయాల వల్ల చెడిపోకుండా, సర్వేలకు బదులుగా కుల గణనను, జనాభా లెక్కల్లో చేర్చామని చెప్పారు.

కులగణన నిర్ణయంతో పాటు, 2025-26 చక్కర సీజన్‌లో చెరకుకు న్యాయమైన, లాభదాయకమైన ధర క్వింటాల్‌కి రూ. 355గా నిర్ణయించామని, ఇది బెంచ్ మార్క్ ధర అని, దీని కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయలేరని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి చెప్పారు. షిల్లాంగ్ నుంచి సిల్చార్ వరకు రూ. 22,864 కోట్ల అంచానా వ్యయంతో హై స్పీడ్ కారిడార్‌ హైవేని నిర్మించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Exit mobile version