TRS MLAs: సుప్రీంకోర్టుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు వ్యవహారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TRS MLAs: తెలంగాణాలో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సంచలంగా మారిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐ లేదా.. సిట్టింగ్ జడ్జి విచారణకు అప్పగించాలన్న బీజేపీ పిటిషన్ నేడు ఢిల్లీకి చేరింది. ఇవాళ సుప్రీంకోర్టులో దీనిపై విచారించేందుకు సిద్దమైంది. తెలంగాణ పోలీసుల అరెస్టును సవాల్ చేసిన రామచంద్ర భారతి సహ ముగ్గురు నిందితులు.. కేసును జస్టిస్ గవాయి, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం విచారణ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీసుల దర్యాప్తుపై విశ్వాసం లేదని, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. నిందితులకు బీజేపీకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ తమ నేతలపై దుష్ప్రచారం చేసేందుకు రాజకీయంగా ఈ కేసులు పెట్టారని పిటిషన్ లో పేర్కొన్న విషయం తెలిసిందే.
అయితే..గతంలో ఈ పిటిషన్ విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసే వరకు దర్యాప్తు నిలిపివేయాలని ఆదేశించడంతో ప్రస్తుతం ఆ కేసు దర్యాప్తు ఆగిపోయింది. ఇక బీజేపీ పిటిషన్ కొట్టివేయాలంటూ కేసు తీవ్రతను వివరిస్తూ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఈనేపథ్యంలో.. సుమారు మూడు గంటల వీడియోలను కూడా హైకోర్టుకు సమర్పించింది. అయితే..ఈ కేసులో ఫోన్ టాపింగ్ జరిగిందని తనను ఇంప్లేడ్ చేయాలంటూ జర్నలిస్టు శివప్రసాద్ రెడ్డి కూడా ఓ పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. సీఎం పర్యవేక్షణలో కేసు దర్యాప్తు జరుగుతున్నందున పోలీసులపై నమ్మకం లేదని సీబీఐకి లేదా స్వతంత్ర విచారణకు ఆదేశించాలని అప్పటివరకు ఆడియోలు, వీడియోలు విడుదల చేయకుండా మద్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని నిందితుడు నందకుమార్ భార్య చిత్రలేఖ కూడా మరో పిటిషన్ దాఖలు చేశారు. వీటన్నింటినీ కలిపి నేడు హైకోర్టులో జస్టిస్ బి. విజయసేన్ రెడ్డితో కూడిన ధర్మసనం విచారణ జరపారు. ఈకేసును సోమవారానికి వాయిదా వేశారు.
Also Read
- Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
- PM Modi: "మార్క్ జుకర్‌బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే..." మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
Read also: Twitter Down: ట్విట్టర్ డౌన్.. లాగిన్‌లో సమస్యలు
మెయిన్‌బాద్‌లోని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫాంహౌజ్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. నాటకీయ పరిణామాల మధ్య నందకుమార్, సింహయాజులు, రామ చంద్రభారతి లను అరెస్ట్ చేశారు పోలీసులు అంటూ టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై నంద కుమార్ మాట్లాడుతూ.. పూజల కోసం మాత్రమే మేము ఫామౌస్ కు వెళ్ళామని వెల్లడించారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో వాస్తవం లేదని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు చేసినట్టు మాకు తెలియదని, సింహయాజులు స్వామిజీ తో సామ్రాజ్య లక్మి పూజ జరిపించడానికి మాత్రమే ఫాంహౌస్ కు వెళ్ళామన్నారు. మునుగోడు ఎన్నికల నేపథ్యంలోనే ఇదంతా చేస్తున్నారని, ఎన్నికలు కాబట్టే ఏలాంటి సమాచారంతో సోదాలు చేశారో మాకు తెలియదన్నారు. స్కామ్ ఎక్కడది.. అసలు ఏంస్కాం మాకు తెలియదని ఆయన అన్నారు. న్యాయాన్ని నమ్ముతున్నాం.. న్యాయ స్థానంలో న్యాయం గెలిచిందని, త్వరలో మీడియాకు అన్ని వివరాలు వెళ్లాడిస్తామని ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.. అయితే నేటి విచారణతో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తేలనుంది.
CM Jagan Gokavaram Tour Live Updates: గోకవరంలో అస్సాగో ఇండస్ట్రీ శంకుస్థాపన లైవ్ అప్ డేట్స్
తాజావార్తలు
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
ట్రెండింగ్
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?