Modi-Putin: “కార్ డిప్లమసీ”.. ఒకే కారులో మోడీ-పుతిన్..
- మరోసారి పుతిన్, మోడీల ‘‘కార్ డిప్లమసీ’’..
- ఒకే కారులో ప్రయాణించిన ఇద్దరు దేశాధినేతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Modi-Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్రమోడీ మధ్య మరోసారి ‘‘కార్ డిప్లమసీ’’ చోటుచేసుకుంది. రెండు దేశాల మధ్య చర్చలు కేవలం టేబుల్ వరకు మాత్రమే పరిమతం కాలేదు. కారులో కూడా ఇరు దేశాల అధినేతలు మాట్లాడుకున్నారు. బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీకి వచ్చిన పుతిన్, ఆయన కారు ‘‘అరస్ సెనాట్’’లో మోడీతో కలిసి ప్రయాణించారు. శనివారం బ్రిక్స్ సమావేశాలు ప్రారంభం అవ్వడానికి ఒక రోజు ముందు ఈ పరిణామం చోటుచేసుకుంది.
గతేడాది చైనాలో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు సందర్భంగా కూడా మోదీ, పుతిన్ ఇదే కారులో కలిసి ప్రయాణించారు. భారత మండపంలో భారత్-రష్యా ద్వైపాక్షిక చర్చలకు హాజరైన ఇద్దరు నేతలు, అక్కడి నుంచి ఒకే కారులో ఇన్నోప్రామ్ కార్యక్రమానికి వెళ్లారు. మరోసారి పుతిన్, మోడీ కారు ప్రయాణం ప్రపంచాన్ని ఆకర్షించింది.
Also Read
- Pakistan Hindu Girls: కిడ్నాప్, మతమార్పిడి, పెళ్లి.. పాకిస్తాన్ కోర్టు బయట హిందూ బాలికల కన్నీళ్లు!
- Suvendu Adhikari: ఆలయంలో చేప ప్రసాదం తిన్న సువేందు అధికారి.. నాన్‌వెజ్ వివాదానికి బీజేపీ తెర!
- Modi-Putin: పుతిన్‌కు మోదీ ‘తమిళ వేదం’.. తిరుక్కురళ్ బహూకరణ
- Allahabad High Court: దంతాలు, వెంట్రుకలతో బాలికగా తేల్చలేం.. అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
గత కొన్ని దశాబ్ధాలుగా భారత్‌కు రష్యా అత్యంత నమ్మకమైన, మిత్రదేశంగా కొనసాగుతోంది. రెండు దేశాల మధ్య బలమైన రక్షణ సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో రక్షణ, ఇంధనం వంటి రంగాల్లో ఇరు దేశాలు కలిసి పురోగమిస్తున్నాయి. పుతిన్ చివరిసారిగా 2025లో భారత్‌లో పర్యటించారు. కొన్ని రోజుల క్రితం కిర్గిజిస్తాన్‌లో జరిగిన SCO సదస్సులో మోదీ, పుతిన్ భేటీ అయ్యారు. ఇప్పుడు, బ్రిక్స్ సమావేశంలో వీరిద్దరి భేటీ కీలకంగా మారింది.
తాజావార్తలు
-
Modi-Putin: “కార్ డిప్లమసీ”.. ఒకే కారులో మోడీ-పుతిన్..
-
ED raids : హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు.. AMR గ్రూప్‌పై సోదాలు..?
-
Pakistan Hindu Girls: కిడ్నాప్, మతమార్పిడి, పెళ్లి.. పాకిస్తాన్ కోర్టు బయట హిందూ బాలికల కన్నీళ్లు!
-
Suvendu Adhikari: ఆలయంలో చేప ప్రసాదం తిన్న సువేందు అధికారి.. నాన్‌వెజ్ వివాదానికి బీజేపీ తెర!
-
Army Camp Arms Theft: బొల్లారం ఆర్మీ క్యాంప్‌లో ఆయుధాల చోరీ.. మాజీ సైనికుడి అరెస్ట్
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?