Site icon NTV Telugu

Cargo Ship Attacked: హార్ముజ్‌లో భారత్ వస్తున్న కార్గో షిప్‌పై అటాక్..

Cargo Ship Attacked

Cargo Ship Attacked

Cargo Ship Attacked: యూఏఈ నుంచి భారత్ వస్తున్న థాయ్ జెండా కలిగిన కార్గో షిప్ పై బుధవారం దాడి జరిగింది. యూఏఈ పోర్టు నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ‘‘హార్ముజ్ జలసంధి’’లో ఈ దాడి జరిగినట్లు థాయ్ నేవీ తెలిపింది. నౌకలోని ఇరవై మంది నావికుల్ని రక్షించారు. ముగ్గురి ఆచూకీ ఇంకా తెలియలేదు. మయూరీ నరీ అనే నౌక భారతదేశంలోని కాండ్లా ఓడరేవుకు వెళుతుండగా దాడి జరిగింది.

Read Also: Rain In Telangana: చల్లని కబురు చెప్పిన తెలంగాణ వాతావరణ శాఖ.. ఈ జిల్లాల్లో వర్షాలే వర్షాలు..

థాయ్ కంపెనీ ప్రెషియస్ షిప్పింగ్ పిసిఎల్ యాజమాన్యంలోని బల్క్ క్యారియర్ మయూరీ నరీ అనే నౌక యుఎఇలోని ఖలీఫా పోర్టు నుండి బయలుదేరి భారతదేశంలోని కాండ్లా పోర్టుకు వెళుతుండగా హార్ముజ్ జలసంధిని దాటుతుండగా దాడి జరిగింది. దాడికి గల నిర్దిష్ట కారణాలు తెలియదని, ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నట్లు థాయ్ నేవీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇరాన్ యుద్ధం మధ్యప్రాచ్యంలోని దేశాల్లో ఉద్రిక్తతల్ని పెంచింది. ఇజ్రాయిల్, అమెరికా దాడులకు ప్రతీకారంగా, ఇరాన్ గల్ఫ్ లోని కువైట్, బహ్రైయిన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈలోని కీలక ప్రాంతాలపై దాడులు చేస్తోంది. చముర రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొంది. ఇప్పుడు దాడికి గురైన షిప్‌ కూడా హార్ముజ్ దాటుకునే భారత్‌కు రావాల్సి ఉంది. ఈ సమయంలోనే దాడికి గురైంది.

Exit mobile version