Site icon NTV Telugu

Gujarat: పోర్‌బందర్‌‌లో ప్రమాదం.. నిత్యవసర వస్తువులతో వెళ్తున్న నౌక దగ్ధం

Gujaratship

Gujaratship

గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుభాష్‌నగర్ జెట్టీ దగ్గర జామ్‌నగర్‌కు చెందిన కార్గో షిప్ మంటల్లో కాలిపోయింది. 950 టన్నుల బియ్యం, 100 టన్నుల చక్కెరను తీసుకెళ్తుండగా హరిదాసన్ అనే కార్గో షిప్ మంటల్లో చిక్కుకుని కాలి బూడిదైంది.

అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి వెళ్లి మంటలను ఆర్పేశారు. కార్గో షిప్ సోమాలియాలోని బోసాసోకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా అధికారులు తెలిపారు. డీజిల్ కారణంగా మంటలు వేగంగా వ్యాప్తి చెందినట్లుగా గుర్తించారు. అయితే ప్రమాదం జరగగానే ఓడరేవు నుంచి కిలోమీటర్ దూరంలోకి లాక్కెళ్లారు. అనంతరం 100 కి.మీ సముద్రంలోకి తీసుకెళ్లారు. అగ్నిమాపక సిబ్బంది, కోస్ట్ గార్డ్స్ సహకారంతో మంటలను అదుపు చేశారు. నౌకలో మంటలు అంటుకోగానే పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి. దీన్ని చూసేందుకు సమీపంలోని స్థానికులు బీచ్ దగ్గరకు వచ్చి వీక్షించారు.

 

Exit mobile version