Site icon NTV Telugu

G7 Summit: జీ-7 సమ్మిట్ కు ప్రధాని మోడీకి ఆహ్వానం..

Modi Pm

Modi Pm

G7 Summit: కెనడాలోని అల్బెర్టాలో ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు జరగనున్న జీ7 సమ్మిట్ కు భారతదేశానికి ఆహ్వానం అందింది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కెనడా ప్రధాని మార్క్‌ కార్నే ఫోన్‌ చేసి సదస్సులో పాల్గొనాలని ఆహ్వానించారు. ఈ విషయాన్ని మోడీ అధికారిక ఎక్స్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. కార్నేతో ఫోన్‌లో మాట్లాడటం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన అతడ్ని అభినందించినట్లు ప్రధాని మోడీ వెల్లడించారు.

Read Also: Covid-19 Variant: వేగంగా వ్యాపిస్తున్న కొత్త కోవిడ్‌ వేరియంట్‌.. లక్షణాలు ఎలా ఉన్నాయంటే..?

అయితే, భారత్‌- కెనడా శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మార్క్‌ కార్నేతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నామని పేర్కొన్నారు. 51వ జీ-7 సదస్సుకు కెనడా ఆతిథ్యం ఇస్తుంది. జీ7 దేశాల్లో భారత్‌ లేన్నప్పటికీ.. నిర్వహణ దేశాల ఆహ్వానం మేరకు మన ప్రధాని మోడీ ఆ శిఖరాగ్ర సదస్సుల్లో పలుమార్లు పాల్గొన్నారు. గతేడాది ఇటలీ వేదికగా జరిగిన సదస్సుకు భారత్‌తో పాటు ఆఫ్రికా, దక్షిణ అమెరికాతో పాటు పలు అభివృద్ధి చెందుతున్న దేశాలు సైతం పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ కూడా పాల్గొని తన గళాన్ని గట్టిగా వినిపించారు.

Exit mobile version