India-Canada Row: ‘‘తీవ్రంగా పరిగణించాలి’’.. కెనడాకు వంతపాడిన అమెరికా..
- కెనడా-ఇండియా వివాదంపై స్పందించిన అమెరికా..
- తీవ్రంగా పరిగణించాలని కోరిన అగ్రరాజ్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Canada Row: భారత్, కెనడాల మధ్య దౌత్యవివాదం తారాస్థాయికి చేరింది. ఖలిస్తానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్యవేత్తల ప్రమేయం ఉందని కెనడా ఆరోపించడంతో భారత్ తీవ్రంగా ఫైర్ అయింది. కెనడాలోని తన ఆరుగురు రాయబారులను వెనక్కి పిలిచింది. ఇదే విధంగా ఇండియాలోని ఆరుగురు కెనడా రాయబారుల్ని శనివారం సాయంత్రంలోగా దేశం వదిలివెళ్లిపోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ పరిణామాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయో అని పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
ఇదిలా ఉంటే, కెనడా చేస్తున్న అసంబద్ధ ఆరోపణలకు అమెరికా వంత పాడుతోంది. నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్లకు సంబంధం ఉందని కెనడా దర్యాప్తుకు సహకరించాలని అమెరికా భారత్‌ని కోరింది. మంగళవారం వాషింగ్టన్లో అమెరికా విదేశాంగ అధికార ప్రతినిధి మాథ్యూమిల్లర్ మాట్లాడుతూ.. కెనడా ఆరోపణల్ని ‘‘తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది’’ అని అమెరికా స్పష్టం చేసింది.
Also Read
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
- Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
Read Also: Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా.. ప్రభుత్వంలో చేరని కాంగ్రెస్..
‘‘కెనడా విషయానికి వస్తే ఆరోపణలు తీవ్రమైనవని మేము స్పష్టం చేశాము. కెనడాకు భారత ప్రభుత్వం సహకరించేలా చూడాలని మేము కోరుతున్నాము.’’ అని మిల్లర్ అన్నారు. నిజ్జర్ కేసులో భారత్ ప్రమేయం ఉన్నట్లు సాక్ష్యాలు పంచుకున్నట్లు కెనడా చేసిన వాదనల్ని భారత్ గట్టిగా తిరస్కరించింది. కెనడాలో ప్రధాని జస్టిన్ ట్రూడో తన రాజకీయ లబ్ధి కోసమే, సిక్కు ఓట్ల కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని భారత్ మండిపడింది.
న్యూజిలాండ్ కూడా భారత్‌పై కెనడా చేసిన ఆరోపణలపై స్పందించింది. న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విన్స్టన్ పీటర్స్ మాట్లాడుతూ.. కెనడా అధికారులు చేసిన బహిరంగ ఆరోపణలు, రుజువైతే చాలా ఆందోళన కలిగించే విషమయని అన్నారు. అమెరికా తర్వాత భారత్‌పై వ్యాఖ్యానించిన 5-ఐస్ దేశాల్లో న్యూజిలాండ్ రెండోది. ఫైవ్ ఐస్ దేశాల్లో ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యూకే, యూఎస్ఏ ఉన్నాయి.
- Tags
తాజావార్తలు
-
IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
-
Vishwa Prasad : అందుకే సుమలతకు సపోర్ట్ చేయడానికి వచ్చా!
-
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..